మార్కెట్లోకి స్మార్ట్ హైబ్రిడ్ టెక్ మారుతి బాలెనో బీఎస్6

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థలలో ఒకటైన మారుతి సుజుకి ఇండియా సోమవారం కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్6 ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా పెట్రో అప్‌గ్రేడ్ చేయబడిన బాలెనో వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు తయారైంది.

2019 Maruti Baleno Petrol BS 6 Launched; Also Gets Smart Hybrid   With New Engine

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థలలో ఒకటైన మారుతి సుజుకి ఇండియా సోమవారం కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్6 ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా పెట్రో అప్‌గ్రేడ్ చేయబడిన బాలెనో వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు తయారైంది.

ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన బాలెనో ధరను రూ. 19,000 పెరిగింది. 1.2 లీటర్ డ్యూయల్‌ జెట్‌ (పెట్రోల్) బీఎస్6 ఇంజీన్‌ బాలెనో  కారు ధర రూ. 5.58 లక్షలు - 8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉండనున్నాయి. త్వరలోనే దేశ వ్యాప్తంగా నెక్సా షోరూంల ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

బాలెనో 2015లోనే లాంచ్ అయ్యిందని, అప్పుడే భారీ అమ్మకాలను నమోదు చేసిందని మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి తెలిపారు. ప్రస్తుతం 5.5లక్షలకుపైగా బాలెనో వినియోగదారులున్నారని, గత సంవత్సరం 2లక్షల యూనిట్లు విక్రయించినట్లు వివరించారు.

బాలెనోను తాజాగా కొత్త డిజైన్, టెక్నాలజీతో అప్‌గ్రేడ్‌ చేశామన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీ లాంగ్‌లైఫ్‌ సర్వీసు అందిస్తుందనీ, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో, వాహన ఉద్గారాలను తగ్గించే మెరుగైన ఇంధన సామర్థ్యంలో వినియోగదారులకు సరికొత్త అనుభూతినిస్తుందని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios