Asianet News TeluguAsianet News Telugu

మారుతీ ఉద్యోగులకు సోకిన కరోనా వైరస్..వారి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు..

మారుతి సుజుకి అడ్మినిస్ట్రేటివ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గురుగ్రామ్ ప్రొడక్షన్ యూనిట్‌లో కరోనా సోకిన 17 మంది అద్రుశ్యమయ్యారు. ఈ సంగతి తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
 

17 corona virus positive employees of Maruti missing, police search on
Author
Hyderabad, First Published Jun 23, 2020, 11:58 AM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ నగరంలో ఉన్న మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ కర్మాగారంలో కరోనా సోకిన 17 మంది ఉద్యోగులు అదృశ్యం అవడంతో వైద్యాధికారులు, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

 కరోనా రోగులు గురుగ్రామ్, జజ్జార్ ప్రాంతాల్లో నివాసముంటున్నారని సమాచారం. మారుతీ సుజుకీ కర్మాగారంలో కరోనా రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 17 మంది మారుతీ  సుజుకీ ఉద్యోగులకు కరోనా సోకినా వారి సమాచారాన్ని అధికారులకు తెలియజేయకుండా కంపెనీ అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని పోలీసులంటున్నారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కరోనా రోగుల కోసం గాలిస్తున్నారు. గురుగ్రామ్ జిల్లాలో ఇప్పటివరకు 67 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గురుగ్రామ్ నగరంలో ఒక్క సోమవారం రోజే 85 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో గురుగ్రామ్ నగరంలో కరోనా కేసుల సంఖ్య 4,512కు పెరిగింది. 

also read కరోనా ఎఫెక్ట్: బీఎండబ్ల్యూలో 6000 మందికి ఉద్వాసన!

విపణిలోకి మారుతి ‘ఎస్‌-ప్రెస్సో’ ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్
మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సంస్థ తన ఎస్‌-ప్రెస్సో మోడల్ కారులో ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్‌ను తీసుకువచ్చింది. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన ఈ కారు ధర రూ.4.84 లక్షలు- రూ.5.13 లక్షల మధ్య పలుకుతున్నాయి.

మారుతి ఎస్-ప్రెస్సో ఎస్-సీఎన్జీ మోడల్ కారు నాలుగు మోడళ్లలో లభిస్తుంది. ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ) మోడళ్లలో అందుబాటులో ఉంది. సీఎన్జీ మోడల్ కార్లను భారతదేశంలో ప్రవేశపెట్టిన తొలి ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి. 

ఎస్-ప్రెస్సో బీఎస్-6 వేరియంట్ కారు 1.0 లీటర్ల ఇంజిన్, 31.2 కి.మీ/కిలోల ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్లు ఉంటుంది. 2019-20లో అత్యధికంగా 1,06,443 సీఎన్జీ మోడల్ కార్లు విక్రయించిన సంస్థగా మారుతి సుజుకి నిలిచింది. 

మిషన్ గ్రీన్ మిలియన్ లక్ష్య సాధనకు ఎస్-ప్రెస్సో సీఎన్జీ మోడల్ కారు ఆవిష్కరణ దోహద పడుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. 2020 ఆటో ఎక్స్ పోలో మారుతి సుజుకి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సీఎన్జీ, హైబ్రీడ్ వెహికల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నది. చౌక ధరతోపాటు హైఫ్యూయల్ ఎఫిసియెన్సీ వినియోగదారులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని మారుతి తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios