Asianet News TeluguAsianet News Telugu

ఆ సమయానికి కస్టమర్లను చేరుకోలేకపోతున్నాం: ఆ సర్వీస్‌కు గుడ్‌బై, జోమాటో సంచలనం

దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 17 నుంచి కిరాణా సరకుల (గ్రాసరీ)  డెలివరీ సర్వీసును నిలివేయనుంది. యాప్‌లో ఉండే స్టోర్ క్యాటలాగ్స్‌లో తరచూ పెద్ద స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. దీనివల్ల వినియోగదారులు చేస్తున్న ఆర్డర్లలో చాలా గ్యాప్ వస్తుందని తెలిపింది. 
 

Zomato to stop grocery delivery
Author
New Delhi, First Published Sep 12, 2021, 7:42 PM IST

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించిన నిత్యావసర సరకుల పంపిణీ (గ్రోసరీ డెలివరీ) ‘గ్రోఫర్స్‌’ సేవల్ని సెప్టెంబరు 17 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. సరకుల పంపిణీ కోసం ప్రస్తుతం తాము అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇవ్వడం లేదని జోమాటో తెలిపింది. దీంతో వినియోగదారుల అవసరాల్ని సకాలంలో తీర్చలేకపోతున్నామని తెలిపింది. అలాగే తక్కువ సమయంలో సరకులు అందజేస్తామన్న నియమానికి కట్టుబడడం సాధ్యం కావడం లేదని కంపెనీ ఆవేదన  వ్యక్తం చేసింది. పంపిణీ జాబితాలో ఎక్కువ మొత్తంలో సరకులు ఉండడం.. నిల్వ స్థాయిలు తరచూ మారుతుండడం వల్ల సకాలంలో అందించడం వీలుపడడం లేదని వెల్లడిచింది.   

మరోవైపు రూ.745 కోట్లు పెట్టుబడిగా పెట్టి గ్రోఫర్స్‌లో మైనారిటీ వాటాలు సొంతం చేసుకున్న జొమాటో.. జులైలో తమ వేదికపై ప్రయోగాత్మకంగా సరకుల పంపిణీని ప్రారంభించింది. కానీ, అది సత్ఫలితాలివ్వకపోవడంతో ఈ రంగం నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. అయితే, నేరుగా జొమాటో వేదికగా సరకుల పంపిణీని ప్రారంభించడం కంటే.. గ్రోఫర్స్‌లో పెట్టుబడులు పెట్టడం వల్లే తమ కంపెనీలోని వాటాదారులకు లాభదాయకమన్న నిర్ణయానికి వచ్చింది కంపెనీ.  
 

Follow Us:
Download App:
  • android
  • ios