న్యూ ఢీల్లీ: ఆక్టివ్ పిఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) అక్కౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) కేటాయిస్తారు. యుఎఎన్ తో మీరు మీ పిఎఫ్ ప్రొఫైల్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు అలాగే ఆన్‌లైన్ పాస్‌బుక్‌ను కూడా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ప్రయోజనాలను పొందడానికి మీరు యుఎఎన్ హోమ్‌పేజీని ఓపెన్ చేసి లాగిన్‌ను క్రియేట్ చేసుకోవాలి.

 ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​సబ్ స్రైబర్స్ కోసం చాలా సులభమైన, ఇబ్బంది లేని సదుపాయాన్ని తీసుకువచ్చింది, దీనిని ఉపయోగించి వారి పిఎఫ్ బ్యాలెన్స్, చివరి కంట్రీబుషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

ఇక మీకు ఆన్‌లైన్ సర్వీస్ కూడా అవసరం ఉండదు, మీ ప్రావిడెంట్ ఫండ్ వివరాలు తెలుసుకోవడానికి కేవలం ఒక్క ఫోన్ కాల్ మాత్రమే చాలు. ఇందుకు  మీరు చేయాల్సిందల్లా మిస్డ్ కాల్ ఇవ్వడం.

యూ‌ఏ‌ఎన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​సభ్యులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వివరాలను పొందవచ్చు.

also read సామాన్యుల అవసరాలను ఈ ఫౌండేషన్ నా కళ్ళు తెరిపించాయి: సుధా మూర్తి ...

మిస్డ్ కాల్ ఫెసిలిటీని పొందటానికి ఉండాల్సినవి ఏమిటి?

సబ్ స్రైబర్స్ మొబైల్ నంబర్ యునిఫైడ్ పోర్టల్‌లో యూ‌ఏ‌ఎన్ తో ఆక్టివేట్ చేయాలి. యూ‌ఏ‌ఎన్ తో  కే‌వై‌సి కింద తెలిపినవి ఉండేలా సబ్ స్రైబర్స్  కన్ఫర్మ్ చేసుకోవాలి.

a. బ్యాంక్ ఎ/సి నంబర్.

బి. ఆధార్ కార్డు

సి. పాన్ కార్డ్

మిస్డ్ కాల్ సౌకర్యం ఎలా పనిచేస్తుంది

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 01122901406 కు మిస్డ్ కాల్ ఇవ్వండి. రెండు రింగుల తర్వాత కాల్  ఆటోమాటిక్ గా డిస్‌కనెక్ట్ అవుతుంది. ఇది ఫ్రీ సర్వీస్, కాబట్టి సబ్ స్రైబర్స్ ఈ సర్వీస్  పొందటానికి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్, ఇతర ప్రొవిజన్స్ యాక్ట్ 1952 పరిధిలోకి వచ్చే యజమానులందరికీ రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఇపిఎఫ్ఓ యుఎన్ తప్పనిసరి చేసిందని గమనించాలి.