గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పుట్టి పెరిగిన చెన్నై ఇంటిని ఎవరు కొనేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు...
మన దేశానికే గర్వకారణమైన వ్యక్తి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ఇంటిని విక్రయించాడు. ఆ ఇంటిని కొనుగోలు చేసింది మరెవరో కాదు తమిళ చిత్ర నటుడు, నిర్మాత, మణికందన్ కావడం విశేషం. చెన్నైలోని అశోక్ నగర్‌లోని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పాత ఇంటిని కొనుగోలు చేయడం తనకు గర్వకారణమని మణికందన్ పేర్కొన్నారు.
Sundar Pichai Sold home in Chennai: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీకి సీఈఓ అయిన సుందర్ పిచాయ్ తన పూర్వీకులు చెన్నైలో నివాసం ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు అనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన రకరకాల కథనాలు ప్రస్తుతం వ్యాప్తిలోకి వచ్చాయి. Google CEO సుందర్ పిచాయ్ తన బాల్యాన్ని గడిపిన, ఇంటిని విక్రయించగా, దాన్ని చెన్నైకి చెందిన సి మణికందన్ కొనుగోలు చేశారు. దీంతో ఆయన తన కల నిజమైందని ఆనందం వెల్లిబుచ్చారు. చెన్నైలోని అశోక్ నగర్‌లో సుందర్ పిచాయ్ ఇంటిని మణికందన్ కొనుగోలు చేశాడు. సుందర్ పిచాయ్ తన బాల్యాన్ని గడిపిన ఇల్లు అమ్మకానికి ఉందని తెలుసుకున్న మణి దానిని కొనాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్టను పెంచిన వ్యక్తి ఇంటిని కొనుగోలు చేయడం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిండంతో పాటు సినీ నిర్మాతగా ఎదిగిన సి.మణికందన్,. తన జీవితంలో సుందర్ పిచాయ్ ఇంటిని కొనడమే అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు.
మణికందన్ ఏమన్నారంటే..?
సుందర్ పిచాయ్ తండ్రి ఆర్‌ఎస్ పిచాయ్ అమెరికాలో స్థిరపడ్డారు.. అందుకే పిచాయ్ కుటుంబం ఉన్న ఇంటిని కొనడానికి తనకు కొంత సమయం పట్టిందని మణికందన్ వివరించాడు. వృత్తిరీత్యా డెవలపర్, మణికందన్ తాను చెల్లప్పస్ బ్రాండ్ పేరుతో 300 ఇళ్లను డెలివరీ చేసినట్లుగా వివరించాడు.
అయితే తాను సుందర్ ఇంటిని కొనుగోలు చేసే పనిమీద వారి ఇంటికి వెళ్లినప్పుడు సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ తయారు చేసిందని, గుర్తుచేసుకున్నారు. వారి కుటంబం వినయపూర్వకమైన విధానాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యానని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేదా బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడానికి గూగుల్ సీఈఓ పేరును ఉపయోగించవద్దని సుందర్ పిచాయ్ తండ్రి పట్టుబట్టారని ఈ సందర్భంగా మణికందన్ తెలిపారు. అంతేకాదు సుందర్ తండ్రి ఇంటి పత్రాలు ఇవ్వడానికి ముందు అవసరమైన అన్ని పన్నులు చెల్లించి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉన్నారని తెలిపారు.
సుందర్ పిచాయ్ చెన్నైలో పుట్టి పెరిగాడు మరియు 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదవడానికి నగరాన్ని విడిచిపెట్టాడు. అతను తన 20 సంవత్సరాల వయస్సు వరకు ఈ ఇంట్లోనే నివసించాడు. గత డిసెంబరులో గూగుల్ సీఈవో హోదాలో సుందర్ చెన్నైలో వచ్చినప్పుడు, ఈ ఇంటికి వచ్చాడు. సెక్యూరిటీ గార్డులకు డబ్బులు, కొన్ని గృహోపకరణాలు పంపిణీ చేశారన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బాల్కనీలో సెల్ఫీలు కూడా దిగారని ఇరుగుపొరుగు గుర్తు చేసుకున్నాడు..ఈ ఆస్తిని సుందర్ తండ్రి తన సొంత ఖర్చులతో పూర్తిగా ధ్వంసం చేసి ప్లాట్‌ను డెవలప్‌మెంట్‌కు అప్పగించాడని మణికందన్ తెలిపారు.