2000 నోట్ల ఉపసంహరణ తర్వాత SBI బ్యాంకులో ఎన్ని 2 వేల నోట్లు జమ అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు..

2000 రూపాయల నోటు  ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు  నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాంకుల్లో  ఈ పెద్ద నోట్లను మార్చుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.మే 23 నుండి, నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, మార్చడం జరుగుతోంది.

You will be shocked to know how many 2000 notes have been deposited in SBI bank after the withdrawal of 2000 notes MKA

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఓ కీలక సమాచారం అందించింది. ఇందులో గత ఏడు రోజుల్లో 2000 రూపాయల నోట్లను ఎంత డిపాజిట్ చేశారో బ్యాంకు వెల్లడించింది. ఎస్‌బీఐకి చెందిన అన్ని శాఖలు, డిపాజిట్ మెషీన్‌ల నుంచి ఇప్పటివరకు 14 వేల కోట్ల రూపాయల 2000 రూపాయల నోట్లు జమ అయ్యాయని ఎస్‌బిఐ చైర్మన్ దినేష్ కుమార ఖరా తెలిపారు. గాంధీనగర్‌లోని GIFT-IFSCలో SBI విదేశీ కరెన్సీ బాండ్ లిస్టింగ్ వేడుకలో దినేష్ కుమార్ ఖరా ఈ సమాచారాన్ని అందించారు.

రూ.2000 నోట్ల రూపంలో రూ.14,000 కోట్లు జమ అయినట్లు ఖరా తెలిపినట్లు ప్రముఖ దినపత్రిక ది హిందూ సైతం పేర్కొంది. కాగా బ్యాంకులోని వివిధ శాఖల్లో  తరపున రూ.3000 కోట్ల విలువైన నోట్లను మార్పిడి చేసుకున్నట్లు తెలిపారు.  మొత్తం రూ.2000 నోట్ల మార్కెట్‌లో 20 శాతం ఎస్‌బీఐకి వచ్చాయని ఖరా తెలిపారు.

2 వేల నోట్లు చట్టబద్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది..

విశేషమేమిటంటే, మే 19న, రూ.2,000 నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు RBI ప్రకటించింది. అయితే, ఈ రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతూనే ఉంది. కానీ అన్ని బ్యాంకులకు రూ.2000 నోట్లను జారీ చేయడాన్ని సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. దీనితో పాటు, మే 23 నుండి నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. .

నోట్ల రద్దు తర్వాత నవంబర్ 2016లో రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రూ.2000 నోట్లతో పాటు రూ.500, రూ.200 నోట్లను కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉంటే 2000 నోట్ల కరెన్సీని జనం ఇంకా వివిధ రూపాల్లో చలామణిలోకి తెచ్చేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.  ముఖ్యంగా బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకుంటే తాము ఆదాయపన్ను శాఖ కిందికి వెళ్తాము అనే అపోహతో జనం ఎక్కువగా 2000 రూపాయల నోట్లను  ఖర్చు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల్లోనూ,  నగల దుకాణాల్లోనూ,  ఖరీదైన వాచి షాపుల్లోనూ 2000 రూపాయల నోట్లతో కొనుగోలు జరుపుతున్నారు. దీంతో పలు వ్యాపారస్తులు తమ వద్ద జమ అవుతున్న 2000 రూపాయల నోట్లకు బ్యాంకులు ప్రత్యేకమైన అనుమతి ఇవ్వాలని పేర్కొంటున్నాయి. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios