వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే..వర్క్ ఫ్రం హోం పద్ధతికి టీసీఎస్..టాటా..బైబై...

దేశంలో అతిపెద్ద IT సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), కోవిడ్ సమయంలో ప్రారంభించిన 'వర్క్ ఫ్రమ్ హోమ్' సిస్టమ్‌ను ముగించింది. ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఉద్యోగులకు టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ ఆదేశించింది.

You have to come to the office 5 days a week TCS Tata Bye-bye for work from home method MKA

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలతో సహా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ద్వారా తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పించాయి. కరోనా తర్వాత, ఒక్కొక్కటిగా కంపెనీలు ఇప్పుడు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలిపిస్తున్నాయి. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ మోడల్‌లో పనిచేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ, ఇప్పుడు ఆఫీసు నుంచి పనిని తప్పనిసరి చేసింది. ఉద్యోగులు వారానికి 5 రోజులు ఆఫీసు నుంచే పని చేయాలని  కంపెనీ ఆదేశించింది. దీని వెనుక కంపెనీ ఒక ప్రధాన కారణం కూడా చెప్పింది.

ఇప్పుడు కరోనాకు ముందు ఉన్న ఆఫీస్ వర్క్ రూల్స్ అమలులోకి వచ్చాయి. గత 3 సంవత్సరాలలో కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. కంపెనీ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా మంది ఫ్రెషర్లు, జూనియర్లు, సీనియర్లు TCSలో చేరారు. TCS సంస్థ అనుకున్న లక్ష్యాన్ని సులభంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా, అడ్డంకులు లేకుండా సాధించాలి. కొత్త ఉద్యోగులు, కంపెనీలో సీనియర్ ఉద్యోగులు అందరూ ఇంటిగ్రేట్ కావడానికి కార్యాలయానికి రావాల్సిందే. కలిసి పని చేయాలని టీసీఎస్ కంపెనీ హెచ్ ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ అన్నారు.

గతంలో టీమ్ వర్క్ ద్వారా TCS తన లక్ష్యాలను సాధించింది. టీమ్ వర్క్ ద్వారా టీసీఎస్ తమ ప్రాజెక్టు వాల్యూ, టీసీఎస్ సీనియర్ అనుభవాలను జూనియర్లకు నేర్పేందుకు వీలవుతుందని హెచ్ ఆర్ హెడ్ తెలిపారు. ఇందుకోసం అందరూ ఆఫీసులో పనిచేస్తేనే సాధ్యం అవుతుందని తెలిపారు. కొత్తగా వచ్చిన వారికి అనుభవ పాఠాలు నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, నేర్పించడం ఆఫీసు నుంచే సాధ్యమవుతుందని అన్నారు. వారంలో 5 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని టీసీఎస్ ఉద్యోగులందరికీ ఈమెయిల్ పంపినట్లు మిలింద్ తెలిపారు.

అక్టోబర్ ప్రారంభం నుండి TCS తన ఉద్యోగులందరినీ కార్యాలయానికి పిలిచింది. కరోనా సమయంలో టీసీఎస్ కంపెనీ కొత్త వర్క్ పాలసీని ప్రకటించింది. దీని ప్రకారం అందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. ఈ విధానం భద్రత, ప్రభుత్వ నిర్బంధంతో సహా అనేక నియమాల ద్వారా అమలు చేయబడింది. 2022 చివరిలో TCS హైబ్రిడ్ మోడల్ విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ప్రకారం, స్థిర ఉద్యోగులు 3 రోజులు ఆఫీసు నుండి పని చేయాలి. 2 రోజులు ఇంటి నుండి పని చేయాలి. ఇప్పుడు మళ్లీ టీసీఎస్ విధానాన్ని మార్చింది. కార్యాలయం నుంచి వారానికి 5 రోజులు పని విధానం అమలులోకి వచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios