కేవలం రూ.10 ఉన్న కూడా బంగారం కొనొచ్చు.. ఎలా అంటే..?
మీరు గూగుల్ పే, ఫోన్ పే ఇక పేటియం ఉపయోగిస్తున్నారా.. అయితే ఇక్కడ మీకు తక్కువ ధరకే బంగారం కొన్నే ఛాన్స్ ఉంది. అదేంటంటే గూగుల్ పే లో గోల్డ్ లాకర్అనే ఫీచర్ ఉంది. మొదట గూగుల్ పే ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో గోల్ లాకర్ అని టైపు చేస్తే చూపిస్తుంది.
ఈ రోజుల్లో బంగారం కొనడం అనేది కాస్త ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇండియాలో బంగారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు బంగారం ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా. మీ దగ్గర పది రూపాలు ఉన్న కూడా బంగారం కొనొచ్చు... ఎలా అని ఆశ్చర్యపోయాతున్నారా.. అవును నిజంగాన్నే బంగారం కొనొచ్చండోయ్.. అయితే ఈ బంగారం ఫిజికల్ గా కాకుండా డిజిటల్ గా ఉంటుంది.
మీరు గూగుల్ పే, ఫోన్ పే ఇక పేటియం ఉపయోగిస్తున్నారా.. అయితే ఇక్కడ మీకు తక్కువ ధరకే బంగారం కొన్నే ఛాన్స్ ఉంది. అదేంటంటే గూగుల్ పే లో గోల్డ్ లాకర్అనే ఫీచర్ ఉంది. మొదట గూగుల్ పే ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో గోల్ లాకర్ అని టైపు చేస్తే చూపిస్తుంది.
సాధారణంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కొన్ని ఆలోచనలు చేస్తుంటారు. అయితే మీరు ఎలాంటి సందేహం లేకుండా గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి కొన్న గోల్డ్ ని తిరిగి అమ్మవచ్చు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు డిజిటల్ గోల్డ్ కొనే ముందు కొనుగోలు ధర(buying price ) ఇంకా అమ్మకపు ధర (selling price) చూడవచ్చు. ఎంత ఎంత మొత్తం బంగారం కోనాలనుకుంటున్నారో ఎంటర్ చేసి బంగారాన్ని మిల్లి గ్రాములు, గ్రాములు లేదా తులంలలో కొనొచ్చు. అయితే మీరు కొనేటప్పుడు ప్రస్తుత ధర బట్టి బంగారం ధర ఉంటుంది.
అంతేకాదు మీరు అమ్మాలనుకున్నప్పుడు కూడా అమ్మకపు ధర చూసి అమ్మవచ్చు. ముఖ్యమైన విష్యం ఏంటంటే బంగారం ధర ప్రతిరోజు మారుతుంటుంది అలాగే వివిధ అంశాల ఆధారంగా ఒకరోజు పడిపోతూ మరోరోజు పెరుగుతుంటుంది. మీరు ఈ బంగారాన్ని గిఫ్ట్ గా కూడా మరొకరికి అందించవచ్చు. బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది కాబట్టి మీరు కొన్న బంగారాన్ని పసిడి ధరలు పెరిగినపుడు ఎక్కువ ధరకు అమ్మవచ్చు కూడా. ఒకవేళ మీరు కొన్న గోల్డ్ ఫిజికల్ గా పొందాలనుకుంటే కూడా డెలివరీ తీసుకునేందుకు అప్షన్ కూడా ఉంది. గూగుల్ పే ద్వారా గోల్డ్ లాకర్ పై చేసే ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా సురక్షితమైనది అని నిపుణుకు కూడా చెపుతున్నారు.
మీరు Google Pay ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసి అమ్మాలంటే కింద స్టెప్స్ అనుసరించండి...
1. మొదట Google Pay యాప్‌ను తెరవండి.
2. ఇప్పుడు సెర్చ్ బార్ లో 'పే న్యూ నంబర్' చోట నొక్కండి.
3. ``గోల్డ్ లాకర్'' అని సెర్చ్ చేసి క్లిక్ చేయండి.
4. ఇక్కడ పన్నులతో సహా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బంగారం ధర చూపబడుతుంది. బంగారం కొనడం ప్రారంభించిన తర్వాత వచ్చే 5 నిమిషాల వరకు ధర మారదు, ఎందుకంటే బంగారం ధర స్థిరమైన హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది. పోస్టల్ కోడ్ ఆధారంగా వివిధ ప్రదేశాలలో పన్ను మొత్తం వైవిధ్యాలకు లోబడి ఉంటుంది.
5. మీకు కావలసినంత బంగారాన్ని INRలో కొనుగోలు చేయవచ్చు. మీరు కొనుగోలు చేయలనుకున్న బంగారంపై పరిమితి లేదు. అయితే రోజుకు 50 వేల రూపాయల వరకు వెచ్చించి బంగారం కొనుగోలు చేయవచ్చు. బంగారం కనిష్టంగా రూ.1కి కూడా లభిస్తుంది. గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్ కింద, మీ గోల్డ్ లాకర్‌లో రూ. 49,999 కంటే ఎక్కువ నిల్వ చేసిన బంగారంపై తదనుగుణంగా పన్ను విధించబడుతుందని గమనించాలి.
6. మీ అనుకూలమైన పేమెంట్ పద్ధతిని ఫాలో అవ్వండి, మొత్తాన్ని చెల్లించండి. ట్రాన్సక్షన్ పూర్తయిన నిమిషాల్లో బంగారం మీ లాకర్‌లో స్టోర్ చేయబడుతుంది.
ట్రాన్సక్షన్ పూర్తయిన తర్వాత, మీరు దానిని క్యాన్సల్ చేయలేరు. అయితే, మీరు ప్రస్తుత మార్కెట్ విలువకు బంగారాన్ని అమ్మవచ్చు.