న్యూ ఢీల్లీ: యెస్ బ్యాంక్  కో-ప్రమోటర్  రానా కపూర్‌ పై మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి లండన్‌లోని రానా కపూర్‌కు చెందిన రూ.127 కోట్ల ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అటాచ్ చేసినట్లు కేంద్ర సెంట్రల్  శుక్రవారం తెలిపింది.

లండన్ లోని 77 సౌత్ ఆడ్లీ స్ట్రీట్ లో ఉన్న అపార్ట్మెంట్ 1 ఫ్లాట్‌ను మనీలాండరింగ్ నివారణ చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఆస్తిని జప్తు చేయడానికి సెంట్రల్  ఏజెన్సీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది."ఈ ఫ్లాట్ మార్కెట్ విలువ 13.5 మిలియన్ పౌండ్లు (ఇండియాలో సుమారు రూ. 127 కోట్లు).

ఈ ఆస్తిని 2017లో రానా కపూర్ 9.9 మిలియన్ పౌండ్లకు (రూ.93 కోట్లు) డి‌ఓ‌ఐ‌టి క్రియేషన్స్ జెర్సీ లిమిటెడ్ పేరిట కొనుగోలు చేశారు "అని ఇడి ఒక ప్రకటనలో తెలిపింది. రానా కపూర్ లండన్లోని ఈ ఆస్తిని వేరే వారి పేరు మీదకి మార్పించడానికి  ప్రయత్నిస్తున్నాడని ఇందుకు అతను ప్రాపర్టీ కన్సల్టెంట్‌ను నియమించాడని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం పొందినట్లు ఏజెన్సీ పేర్కొంది.

"ఓపెన్ సోర్సెస్ నుండి జరిపిన విచారణలలో ఈ ఆస్తి అనేక వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టారని" అని తెలిపింది. ఏజెన్సీ  ప్రకారం ఇప్పుడు అటాచ్మెంట్ ఆర్డర్‌ను అమలు చేయడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌లో సంప్రదించి, పిఎమ్‌ఎల్‌ఎ క్రిమినల్ సెక్షన్ల క్రింద స్వాధీనం చేసుకున్నందున ఈ ఆస్తిని అమ్మడం లేదా కొనుగోలు చేయడం సాధ్యం కాదని, క్రిమినల్ కేసు కింద సైజ్ చేయనున్నట్లు  ఒక ప్రకటనను కూడా జారీ చేస్తుంది.

also read  కాఫీడే వెండింగ్ బిజినెస్ కొనుగోలుకు టాటా కన్స్యూమర్ ప్రయత్నాలు.. ...

పిఎమ్‌ఎల్‌ఎ కింద ఇడి ఇంతకుముందు యుఎస్, దుబాయ్, ఆస్ట్రేలియాలోని  ఆస్తులను కూడా జప్తు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ అధ్యయనం చేసిన తరువాత రాణా కపూర్, అతని కుటుంబ సభ్యులు, ఇతరులపై ఇడి కేస్ నమోదు చేసింది, చట్టానికి విరుద్ధంగా రాణా కపూర్ యెస్ బ్యాంక్ నుండి వివిధ సంస్థలకు కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఆరోపించింది.

2018 ఏప్రిల్-జూన్ కాలంలో యెస్ బ్యాంక్ లిమిటెడ్ డిహెచ్‌ఎఫ్ఎల్ షార్ట్ టర్మ్ డిబెంచర్లలో రూ .3,700 కోట్లు పెట్టుబడి పెట్టిందని సిబిఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. "కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్ వారి కుటుంబ సభ్యుల యాజమాన్యంలోని డిహెచ్ఎఫ్ఎల్ గ్రూప్ కంపెనీ ఆర్కెడబ్ల్యు డెవలపర్స్ కు యెస్ బ్యాంక్ లిమిటెడ్ 750 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది" అని ఇడి ఆరోపించింది.

750 కోట్ల రూపాయల రుణాన్ని ముంబైలోని బాంద్రా పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం మంజూరు చేశారు, అయితే ఈ మొత్తాన్ని కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్ షెల్ కంపెనీల ద్వారా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో రానా కపూర్, కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లను ఇడి అరెస్టు చేసి ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో పెట్టారు. ఈ కేసులో ఏజెన్సీ ముంబైలోని ప్రత్యేక కోర్టు ముందు చార్జిషీట్లు దాఖలు చేసింది.