Asianet News TeluguAsianet News Telugu

ఐటీసీ ఛైర్మన్ దేవేశ్వర్ కన్నుమూత

బిజినెస్ టైకూన్, కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్(72) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన  గుడ్ గావ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

YC Deveshwar, ITC's longest-serving chairman, passes away
Author
Hyderabad, First Published May 11, 2019, 1:51 PM IST

బిజినెస్ టైకూన్, కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్(72) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన  గుడ్ గావ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.దేవేశ్వర్‌ మృతిపట్ల ఐటీసీ కంపెనీ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. 

1968లో తొలిసారిగా ఐటీసీలో అడుగుపెట్టిన   దేవేశ్వర్‌ అంచెలంచెలుగా ఎదిగారు.  1996లో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవిని చేపట్టారు.  ఫిబ్రవరి 5, 2012న మరోసారి డైరెక్టర్‌గా, చైర్మన్‌గా దేవేశ్వర్‌ ఎన్నికై 2017 వరకు కొనసాగారు. 2017 నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా దేవేశ్వర్‌ కొనసాగుతున్నారు. 

ఇక 1991-94 మధ్య కాలంలో ఎయిరిండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. ఎక్కువ కాలం ఒకే కంపెనీకి ఛైర్మన్ గా కొనసాగిన అతి కొద్ది మందిలో దేవేశ్వర్ ఒకరు. ఐటీసీ కంపెనీ టర్నోవర్ ని కూడా దేవేశ్వర్ రూ.5,200 కోట్ల నుంచి రూ.51,000 కోట్లకు చేర్చారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios