కేవలం 10 సెకన్ల యాడ్ కోసం ఇంత డబ్బా.. ! ప్రపంచ కప్ ఫైనల్ కోసం కళ్ళు చెదిరే రేట్లు..
.10 సెకన్ల యాడ్ కోసం డిస్నీ స్టార్ కోట్ చేసిన ధరలు సుమారు రూ.30-35 లక్షలుగా ఉన్నాయని కూడా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే రూ.25-35 లక్షల రేంజ్‌లో యాడ్ డీల్ కోసం చర్చలు ముందే జరిగాయి. సాధారణంగా, ప్రపంచ కప్ టోర్నమెంట్ 70% అడ్వర్టైజింగ్ స్లాట్‌లు టోర్నమెంట్ ప్రారంభానికి ముందే అమ్ముడవుతాయి.
ముంబయి : 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీ గత ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాతో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఇదిలా ఉంటే, లైవ్ ఛానెల్‌లో ప్రసారమయ్యే 10 సెకన్ల యాడ్ ధర రూ. 35 లక్షలకు చేరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.10 సెకన్ల యాడ్ కోసం డిస్నీ స్టార్ కోట్ చేసిన ధరలు సుమారు రూ.30-35 లక్షలుగా ఉన్నాయని కూడా పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
అయితే రూ.25-35 లక్షల రేంజ్‌లో యాడ్ డీల్ కోసం చర్చలు ముందే జరిగాయి. సాధారణంగా, ప్రపంచ కప్ టోర్నమెంట్ 70% అడ్వర్టైజింగ్ స్లాట్‌లు టోర్నమెంట్ ప్రారంభానికి ముందే అమ్ముడవుతాయి. మిగిలిన 30 శాతం టోర్నమెంట్ సమయంలో అమ్మబడుతుంది. ఇదే లెక్కన భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 10-15 శాతం అడ్వర్టైజ్‌మెంట్ స్లాట్‌లు అమ్ముడుపోలేదు.
కనెక్టెడ్ టీవీ (సీటీవీ) అండ్ డిస్నీ హాట్‌స్టార్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యాడ్ స్లాట్‌ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రపంచ కప్ సమయంలో CTV ప్రకటనల స్పాట్ రేట్లు రూ. 5-6 లక్షలు అయితే, ప్రపంచ కప్ సమయంలో కేవలం 10 సెకన్ల స్లాట్ రేట్లు రూ. 8-10 లక్షలు. Disney+ Hotstar యాప్ అండ్ వెబ్‌సైట్ డిజిటల్ కోసం యాడ్ రేట్లు దాదాపు రూ.500-600 CPM వద్ద కోట్ చేయబడ్డాయి.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ-ఫైనల్‌కు గరిష్టంగా 5.3 కోట్ల వ్యూస్ వచ్చినట్లు డిస్నీ+ హాట్‌స్టార్ తెలిపారు. గతంలో నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కు 4.4 కోట్ల వ్యూస్ రావడం అత్యధికం. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో డిజిటల్ అండ్ టీవీ రెండింటిలోనూ వ్యూస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. టీవీలో ప్రత్యక్ష ప్రసారాలను చూసే వారి సంఖ్య పెరుగుతుందని పరిశ్రమ చెబుతుంది.
అంతేకాకుండా, టీమ్ ఇండియా అత్యంత సక్సెస్ ఫుల్ టూర్ కారణంగా యాడ్ రేట్లు మరింత పెరిగాయి. నాన్-ఇండియన్ మ్యాచ్‌లతో పోలిస్తే, భారతదేశంలో క్రికెట్ మ్యాచ్ యాడ్స్ రేట్లు గణనీయంగా పెరిగాయి. టోర్నమెంట్ మొత్తంలో భారతదేశం మ్యాచ్‌ల ప్రకటనల రేట్లు 4 నుండి 6 రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఎలారా క్యాపిటల్ కరణ్ తౌరానీ చెప్పారు. ప్లేఆఫ్‌ల కంటే సెమీఫైనల్స్ ధర 2.5 రెట్లు ఎక్కువ అని పేర్కొంది.