స్టాక్‌మార్కెట్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ సక్సెస్ చాన్స్, ఈ టిప్స్ పాటిస్తే మార్కెట్లో మహిళలకు తిరుగు లేదు

స్టాక్ మార్కెట్లో పురుషుల కన్నా మహిళలే చక్కగా రాణిస్తారని చాలామంది నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాన్ని  చాలామంది ఏకీభవిస్తారు కూడా.  అందుకు కారణాలు లేకపోలేదు ముఖ్యంగా మహిళల మనస్తత్వానికి, స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు చక్కటి బంధం ఉంది.  ఈ నేపథ్యంలో మహిళలు స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఎలాంటి మెలకువలు తెలుసుకోవాలో చూద్దాం. .  

 

Women have more chance of success than men in the stock market, if you follow these tips, there is no turning back for women in the market MKA

స్టాక్ మార్కెట్ అనేది పూర్తిగా జూదం అని ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుందని,  స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే నష్టపోయి చేతులు కాల్చుకోవాల్సిన ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు.  అందుకు తగ్గట్టుగానే చాలామంది స్టాక్ మార్కెట్లో తొందరపాటులో పెట్టుబడులు పెట్టి నష్టపోయి వెంటనే బయటికి వచ్చి స్టాక్ మార్కెట్ అంతా ఒక జూదం అంటూ పెదవి విరుస్తూ  ఉంటారు. . అవును స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికైనా ఒక రిస్కు ఉన్నటువంటి పెట్టుబడి.  లాభనష్టాలకు లోబడి మీ పెట్టుబడును స్టాక్ మార్కెట్లో ఉంటాయి.  అయితే అలాగని మీ పెట్టుబడును ఖచ్చితంగా మునిగిపోతాయని అనుకుంటే మాత్రం పొరపాటే.  చాలామంది స్టాక్ మార్కెట్లో చేసే అతిపెద్ద మిస్టేక్ తొందరగా లాభాలు గడించాలని అనుకోవడమే.  నిజానికి స్టాక్ మార్కెట్ను జాగ్రత్తగా అర్థం చేసుకొని పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే మరే ఇతర రంగంలోనూ ఈ స్థాయిలో మీరు డబ్బు సంపాదించలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. . మన దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రపంచంలోని ఇతర స్టాక్ మార్కెట్లతో పోల్చి చూస్తే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత 15 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే నిఫ్టీ 50 సూచీ, యావరేజీగా ప్రతి ఏడు 12 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. 

మహిళలు స్టాక్ మార్కెట్లో రాణించే చాన్స్..

ముఖ్యంగా మహిళలు స్టాక్ మార్కెట్లో ప్రవేశిస్తే పురుషులకన్నా కూడా చక్కగా  రాణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలామంది మహిళలు తమ ఇంట్లో ఖాళీ సమయంలో స్టాక్ మార్కెట్ పట్ల అవగాహన పెంచుకున్నట్లయితే.  చక్కగా పెట్టుబడులను మంచి స్టాక్ లో పెట్టి లాభాలు పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ఎందుకంటే ముఖ్యంగా సాధారణ గృహిణులు సైతం స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం మంచి లాభాలతో రాణిస్తున్నారని చెబుతున్నాయి. 

మహిళలు స్టాక్ మార్కెట్ లో రాణించాలంటే ఏం చేయాలి..

ముందుగా మహిళలు స్టాక్ మార్కెట్లో రాణించాలంటే అసలు మార్కెట్ పట్ల ప్రాథమిక అంశాలు తెలుసుకుంటే మంచిది.  ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థ అలాగే,  దేశంలో ఉన్నటువంటి  బడా కంపెనీలు వాటి వ్యాపార సరళి గురించి ప్రాథమిక అంశాలను తెలుసుకోవాలి.  అదేవిధంగా న్యూస్ పేపర్లలో  వచ్చే బిజినెస్  సంబంధిత వార్తలను రెగ్యులర్ గా చదువుకోవాలి.  అలాగే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది.  స్టాక్స్ ఎలా కొనుగోలు చేయాలి.  డీమాట్ అకౌంట్ అంటే ఏమిటి.  వంటి విషయాలను తెలుసుకుంటే మంచిది. 

మార్కెట్లో బడా స్టాక్స్ పై ఒక కన్నేయండి..

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు ముందుగా సెన్సెక్స్ 30,  నిఫ్టీ 50  జాబితాలో ఉన్న షేర్లను ప్రతిరోజు ట్రాక్ చేస్తూ ఉండాలి.  ఒక వారంలో అవి  ఎంత మేర వృద్ధి సాధించాయో తెలుసుకోవాలి.  అదేవిధంగా ఒక నెల రోజుల్లో ఆ స్టాక్స్ ఎంత లాభం గడిచాయి లేదా ఎంత నష్టపోయాయో గమనించాలి.  అప్పుడు స్టాక్ మార్కెట్ పట్ల ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. 

మహిళలు పురుషులతో పోల్చితే పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉంటారు..

 సాధారణంగా పెట్టుబడి విషయంలో పురుషులని దూకుడు స్వభావం ఉంటుంది.  కానీ స్టాక్ మార్కెట్లో దూకుడు స్వభావం ఉంటే సరిపోదు. ఒక స్టాక్ వేగంగా పెరుగుతోందని అందులో పెట్టుబడి పెడితే మొదటికే మోసానికి వచ్చే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా చిన్నాచితకా కంపెనీలు  స్మాల్ క్యాప్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది.  అదే మహిళల విషయానికి వస్తే మహిళలు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్న పెట్టుబడి పెట్టాలన్న ఒకటికి పది సార్లు కూలంకషంగా ఆలోచిస్తారు.  అందుకే స్టాక్ మార్కెట్లో మహిళలకు మనస్తత్వం కరెక్ట్ గా సూట్ అవుతుంది. 

ఫండమెంటల్స్, టెక్నికల్స్ ముఖ్యం..

స్టాక్ మార్కెట్లో టెక్నికల్స్,  ఫండమెంటల్స్  అనేది చాలా ముఖ్యం.  టెక్నికల్స్ అంటే ఒక స్టాక్ టెక్నికల్ గా చార్ట్ లో  ఎలా ముందుకు వెళుతుంది.  దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.   ఇంకా ఫండమెంటల్స్ అనేవి ఒక కంపెనీ ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.  ముఖ్యంగా కంపెనీ త్రైమాసిక ఫలితాలు.  కంపెనీ గురించి వచ్చే వార్తలు,  అలాగే కంపెనీ ఆర్డర్లు,  లాభాలు నష్టాలు ఇలా అన్నింటినీ మేరేజ్ వేసుకొని ఫండమెంటల్ సాధారణంగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. 

మ్యూచువల్ ఫండ్స్ పై కన్నేయండి..

స్టాక్ మార్కెట్లో ప్రవేశించడం రిస్క్ అనుకుంటే  మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు,  ముఖ్యంగా నెలవారి సిప్ ప్రాతిపదికన  పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి మొత్తంలో మీరు ఆదాయం పొందే వీలుంది.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios