Asianet News TeluguAsianet News Telugu

Google కొత్త గేమింగ్ విధానం నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన WInzo గేమింగ్ యాప్..

Google కొత్త గేమింగ్ విధానంపై భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ WinZO కోర్టుకెక్కింది. గూగుల్  కొత్త గేమింగ్ విధానాన్ని వివక్షాపూరితంగా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గూగుల్ కొత్త విధానాన్ని అమలు చేయకుండా ఆపాలని విన్జో హైకోర్టును ఆశ్రయించారు.

WInzo gaming app approached the Delhi High Court to stop Google new gaming policy
Author
First Published Sep 20, 2022, 9:29 PM IST

Google కొత్త గేమింగ్ విధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.  గూగుల్ సరికొత్త గేమింగ్ విధానం పై భారతీయ ఆన్ లైన్ గేమ్ ప్లాట్ ఫాం వింజో యాప్ యాప్..ఈ వివాదంపై ప్రస్తుతం హైకోర్టుకెక్కింది. ఈ కొత్త గేమింగ్ విధానం పూర్తిగా వివక్షపూరితంగా ఉందని ఢిల్లీ హెకోర్టును యాప్ యాజమాన్యం ఆశ్రయించింది. కొత్త గేమింగ్ విధానం అమలు చేయకుండా గూగుల్ ను ఆపాలని వింజో హైకోర్టుకు విన్నవించుకుంది. వింజో యాప్ పలు రియల్ మనీ గేమ్స్ ను అందిస్తోంది ఈ గేమ్స్ ఆడేందుకు యూజర్స్ డబ్బును చెల్లించడం, గేమ్స్ గెలవడం ద్వారా కానుకలను పొందడం జరుగుతుంది.

Winzo యాప్ ఫాంటసీ స్పోర్ట్స్, రమ్మీ కేటగిరీలలో  పెయిడ్ గేమ్స్ అందిస్తుంది.  క్యారమ్, పజిల్స్, కార్ రేసింగ్ వంటి అనేక ఇతర విభాగాలలో రియల్-మనీ గేమ్‌లు ఈ వింజో యాప్ లో ఉన్నాయి. గూగుల్  కొత్త గేమింగ్ పాలసీని అమలు చేయడంతో,  Winzo ఇరకాటంలో పడింది. అందుకే  హై కోర్టులో సవాల్ చేసింది.

గూగుల్ తన గేమింగ్ పాలసీని
బిజినెస్ స్టాండర్డ్‌లోని ఒక రిపోర్ట్ ప్రకారం, గూగుల్ కొన్నేళ్లుగా భారతదేశంలో ఎలాంటి రియల్-మనీ గేమ్‌లను అనుమతించడంలేదు. అయితే ఈ నెలలో Google ఒక సంవత్సరం పైలట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఫాంటసీ స్పోర్ట్స్,  రమ్మీ కోసం ఇటువంటి గేమ్‌లను ప్లే స్టోర్‌లో చేర్చింది.  భారతదేశంలో మొబైల్ గేమ్స్ బాగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో, ఫాంటసీ క్రికెట్ ఆడటానికి Dream11, మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) గేమ్‌లు ఈ విభాగంలోకి ప్రవేశించాయి. విదేశీ ఇన్వెస్టర్లు టైగర్ గ్లోబల్, సీకోయా క్యాపిటల్ వీటిలో పెట్టుబడులు పెట్టాయి.

గూగుల్ నుంచి స్పందన లేదు..
ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన దావాలో, వించో తాజా అప్‌డేట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 10న గూగుల్‌ను ఆశ్రయించామని, ఇది 'అన్యాయం' అని పేర్కొంది. కానీ గూగుల్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో  హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది. 

భారతదేశంలో 8.5 కోట్ల మంది Winzo యూజర్లు ఉన్నారు
వింజో భారతదేశంలో దాదాపు 85 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉందని పేర్కొంది. సగటున, వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఒక గంట గడుపుతారు. హైకోర్టులో దాఖలు చేసిన కేసు ప్రకారం, విన్జో 2020-21లో 13 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని పొందింది.

ఆన్‌లైన్ గేమింగ్ 
భారతదేశంలో ఆన్‌లైన్ గేమ్‌లు గత కొంతకాలంగా వివాదంలో ఉన్నాయి.ఆన్‌లైన్ గేమ్‌లను వర్గీకరించడానికి నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వ ప్యానెల్ సూచించింది. ఇది మాత్రమే కాదు, నిషేధిత గేమింగ్ ఫార్మాట్‌లను బ్లాక్ చేయాలని, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్‌లపై కఠినమైన వైఖరిని తీసుకోవాలని కూడా సూచించబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios