న్యూ ఢిల్లీ: మీరు కూడా డిసెంబర్ 1 తర్వాత ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా? మీరు రైలు టికెట్ బుక్ చేసుకున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇటీవల, వాట్సాప్‌లో ఒక మెసేజ్ చాలా వేగంగా వ్యాపించింది.

అందులో ఏముందంటే డిసెంబర్ 1 నుండి కోవిడ్-19 స్పెషల్ రైలుతో సహా అన్ని రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించినట్లు మెసేజులో పేర్కొంది. మీకు కూడా అలాంటి మెసేజ్ వస్తే, అది పూర్తిగా నకిలీ వార్త అని గుర్తుపెట్టుకోండి, కాబట్టి అలాంటి వాటిని ఇతరులకు పమించకుండా పూర్తిగా నివారించడం మంచిది.

వాట్సాప్‌లో ప్రసారం అవుతున్న మెసేజ్ నకిలీదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అందులో నిజం లేదు ప్రస్తుతం ప్రభుత్వానికి అలాంటి ప్రణాళిక లేవు, రైలు సర్వీసులను ఆపడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పిఐబి ఫాక్ట్ చెక్ తెలిపింది.

also read ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత ఖరీదైన కార్లు, డ్రైవర్ల జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

కరోనా సంక్షోభం నేపథ్యంలో గతంలో కూడా పలు నకిలీ వార్తలు సోషల్ మీడియాలో ప్రసారం కావడం ప్రజలను గందరగోళానికి గురిచేసింది. కరోనా కాలంలో ఇటువంటి నకిలీ మెసేజులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తప్పుడు సమాచారం ఉన్న వార్తలని నిర్ధారణ చేసుకోకుండా ఇతరులకు పంపించడం, లేదా వ్యాప్తి చేయకుండ ఉండటం మంచిది.

మీకు అలాంటి నకిలీ మెసేజులు వస్తే, మీరు దానిని https://factcheck.pib.gov.in/ లేదా వాట్సాప్ నంబర్ +918799711259 లేదా పిఐబి ఫాక్ట్ చెక్ ఇ-మెయిల్ pibfactcheck@gmail.com కు పంపవచ్చు.