గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ నెల నాటికి పసిడి ధర రికార్డు స్థాయిలో రూ.5684 రూపాయలు పడిపోయింది. అంతకు ముందు 10గ్రాములకు 56 వేల ధరతో రికార్డు నెలకొల్పింది. పండుగ సీజన్ వస్తుండటంతో రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంత వరకు పడిపోతుందని కొనుగోలుదారుల్లో ఆసక్తి కలిగిస్తుంది. 

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ విపరీతంగా క్షీణించింది, అయితే, ఇప్పుడు మార్కెట్లలో స్థిరమైన టర్నోవర్ ఉంది. అయితే, బంగారం ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సెప్టెంబర్ 30 వరకు బంగారం ధర 10 గ్రాములకు 5684 రూపాయలు తగ్గింది, అయితే వెండి కూడా గరిష్ట స్థాయి నుండి 1,434 రూపాయలు తగ్గింది.

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమాని ప్రకారం, "బంగారం ధర చౌకగా ఉంటుందని లేదా మునుపటి ధర స్థాయికి వస్తుందని మీరు భావిస్తే, ఆ ఆలోచన తప్పు కావచ్చు" అని అన్నారు.

ప్రస్తుతం బంగారం ధర రూ.50 వేల వరకు పడిపోయింది, వెండి ధర కూడా కిలోకి రూ.60వేల చేరువలో ఉంది. రాబోయే రోజుల్లో వీటి ధరల్లో  హెచ్చుతగ్గులు కొనసాగవచ్చు. దీపావళి వరకు బంగారం ధరలలో పెద్దగా పెరుగుదల లేదా తగ్గే అవకాశం లేదు. దీపావళి సీజన్ లో కూడా బంగారం 10 గ్రాములకు 50వేల నుండి 52వేల  పరిధిలో ఉంటుంది.

also read బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా వేతనాల పెంపు.. ...

కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్టిమ్యులస్ ప్యాకేజీ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లను పెంచింది. బంగారం ధరలు తగ్గడానికి కారణం గత రెండు నెలల్లో రూపాయి బలపడటం. రూపాయి ప్రస్తుతం డాలర్‌కు 73-74 రూపాయల పరిధిలో ఉంది.

డాలర్ పెరిగితే దీర్ఘకాలంలో బంగారం ధర మరింత వేగంగా పెరుగుతుంది. వచ్చే ఏడాది నాటికి బంగారం పది గ్రాములకు 60 నుంచి 70 వేల రూపాయలకు చేరుకుంటుంది.

7 ఆగష్టు 2020న బంగారం ధర మార్కెట్లో ఆల్ టైం గరిష్ట స్థాయి రూ.56,254కు చేరుకోగా, వెండి కూడా అదే రోజు కిలోకు 76,008 రూపాయల ధరను తాకింది. బంగారం ధర అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

లాక్ డౌన్ వల్ల స్తంభించి పోయిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో అన్ని దేశాలు నిమగ్నమైన తరువాత ఇప్పుడు అన్‌లాక్ దశలోకి ప్రవేశిస్తున్నప్పుడు, వచ్చే ఏడాది నాటికి డాలర్ బలోపేతం కావడంతో బంగారం ధర కూడా అకస్మాత్తుగా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.