2017లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను సమర్పించే పాత విధానాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

సాధారణంగ ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అయితే ఈ తేదీనే బడ్జెట్ ను ఎందుకు తీసుకోసారో చాల మందికి తెలిసి ఉండకపోవచ్చు. 

ఎప్పటిలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ కోసం ఫిబ్రవరి 1 తేదీ వెనుక నేపథ్యం తెలుసుకుందాం... 

2017లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను సమర్పించే పాత విధానాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టే ఆనవాయితీకి స్వస్తి పలికారు.

పాత విధానంలో ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఢిల్లీ, బ్రిటన్ మధ్య టైం వ్యత్యాసమే బ్రిటీష్ పాలన నుంచి అమలవుతున్న ఈ పద్ధతికి కారణమని చెబుతున్నారు. భారత సమయం UK టైం కంటే 4.5 గంటలు ముందుంది.

1998 నుండి 2002 వరకు వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా కూడా బడ్జెట్ సమర్పణల సమయాన్ని మార్చాలని ప్లాన్ చేశారు. 1999 కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు సమర్పించాలనుకున్నారు.
బడ్జెట్‌పై మరింత చర్చ జరగాలన్న డిమాండ్‌కు విశేష స్పందన లభించింది. 1999 ఫిబ్రవరి 27న స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

కేంద్ర ప్రభుత్వ పదవీకాలం ముగిసి ఎన్నికల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కావడం గమనార్హం.