ఓడలు బండ్లంటే ఇదే: టీసీఎస్‌తో పోలిస్తే ఇన్ఫోసిస్...

Why Infosys results are a bit of a worry for investors
Highlights

దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒక్కటైన ఇన్ఫోసిస్ భవితవ్యం గురించి మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. 2009లో టీసీఎస్ కంటే 1.5 రెట్లు మార్కెట్ కేపిటలైజేషన్ గల ఇన్ఫోసిస్.. ప్రస్తుతం టీసీఎస్ కంటే 2.6 రెట్లు వెనుకబడింది.

ముంబై: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ ఫలితాల పట్ల అమెరికన్ మదుపర్లు స్పష్టమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో ఇన్ఫోసిస్ స్టాక్ నాలుగు శాతానికి పైగా పతనం కావడమే దీనికి నిదర్శనం. పరిస్థితులు సజావుగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరుగుదల, లాభాల గైడెన్స్ లక్ష్యాలను చేరుకుంటున్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 

గత త్రైమాసికంతో పోలిస్తే కరెన్సీరూపంలో ఆదాయం ఆరు శాతం స్థిరంగా సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెవెన్యూ 6.4 శాతం పెరిగింది. 2018 - 19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కేవలం ఆరు శాతం ఆదాయం మాత్రమే పెరిగింది. 

వ్రుద్ధిరేటు సాధిస్తామన్న అంచనాల మధ్య ఈ ఏడాది ఐటీ స్టాక్స్ పెరుగుతున్న సంగతిని మదుపర్లు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు ఈ సిద్ధాంతాలకు మద్దతుగా లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కీలక ఆర్థిక సేవల విభాగ ఆదాయంలో భారీగా తగ్గుముఖం పట్టాయని గుర్తు చేస్తున్నారు. 

దీనికి భిన్నంగా ఇన్ఫోసిస్ సంస్థకు మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో గత మార్చితో ముగిసిన త్రైమాసికం ఆర్థిక ఫలితాలతో పోలిస్తే, 200కు పైగా బేసిక్ పాయింట్లలో వ్రుద్ధి రేటు నమోదైంది. ఆర్థిక సేవల రంగంలో 3.7 శాతం పురోగతి సాధించింది టీసీఎస్. ఇన్ఫోసిస్ ఫలితాలతో పోలిస్తే టీసీఎస్ ఆర్థిక ఫలితాల్లో 3 -4 శాతం పాయింట్లు అధికంగా లాభాలు గడించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ సంస్థల మధ్య అంతరాయం మరింత పెరుగుతోంది. 

ఇన్ఫోసిస్ మార్జిన్ ఔట్ లుక్ కూడా మదుపర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఏప్రిల్ నెలలో విదేశీ కరెన్సీతో అమెరికా డాలర్ పై రూపాయి విలువ 65గా నిర్ధారించారు. ఈ క్రమంలో 2018 - 19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో 22 - 24 % పురోగి సాధిస్తుందని అంచనా వేశారు. నాటి నుంచి ఇప్పటివరకు డాలర్‌పై రూపాయి మారకం విలువ 5% తగ్గినా ఇన్ఫోసిస్ మార్జిన్ గైడెన్స్ అలాగే కొనసాగుతున్నది. 

ఇన్ఫోసిస్ ఐటీ స్టాక్స్ చివరి దశలో పైపైకి దూసుకెళ్లినా.. రూపాయి పతనం వల్లే ఇన్ఫోసిస్ లాభాల పెరుగుదలకు దారి తీసింది. ఇన్ఫోసిస్ గైడెన్స్‌ను అనుసరించడం లేదు. తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడించిన తర్వాత ఇన్ఫోసిస్ నూతన కస్టమర్లతో ఒప్పందాలపై కేంద్రీకరించింది. ఆరోగ్యకర పరిస్థితుల కోసం ఆయా కస్టమర్లతో ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. కానీ జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఈ అంశాలేవీ కనిపించకపోవడంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. 

2009లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో సమానంగా ముందుకు సాగిన ఇన్ఫోసిస్ ప్రస్తుతం పోటీ పడేందుకు వెనుకాడుతోంది. 2009లో భారత ఐటీ దిగ్గజంగా ఇన్ఫోసిస్ సంస్థను పరిగణించే వారు కానీ 2018లో పరిస్థితి దాటిపోయింది. దేశంలోకెల్లా సాఫ్ట్ వేర్ సర్వీసెస్ ఎక్స్‌పోర్టర్‌గా టీసీఎస్ కంటే వెనుకబడి పోవడానికి దశాబ్ద కాలం సమయం పట్టిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

2018 జూలై 13వ తేదీన టీసీఎస్ మార్కెట్ కేపిటలైజేషన్ విలువ రూ.7,58,536.46 కోట్లు. ఇది ఇన్పోసిస్ మార్కెట్ కేపిటలైజేషన్ విలువ రూ.2,85,924.10 కోట్లతో పోలిస్తే 2.6 రెట్లు ఎక్కువ. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే 2009లో ఇన్ఫోసిస్ మార్కెట్ కేపిటలైజేషన్ 1.5 రెట్లు ఎక్కువ. గత 10 ఏళ్లలో ఇన్ఫోసిస్ షేర్ 236 రెట్లు పెరిగి ఈ నెల 13న రూ.1,309.10 వద్ద స్థిర పడితే టీసీఎస్ షేర్ విలువ 930 శాతం వ్రుద్ది చెంది రూ.19,81.25 వద్ద నిలిచింది. 

loader