Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి తరువాత భార్య పేరు ఆధార్‌లో ఉండాలా: ఇలా ఈజీగా మార్చుకోవచ్చు..

జీవితంలో అన్ని రంగాల్లో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది . బ్యాంకు ఖాతాలు తెరవడం లేదా సిమ్ కార్డులు పొందడం వంటి ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆధార్ అవసరం. 

Whether spouse's name should be in Aadhaar; These ways are very easy-sak
Author
First Published Jan 5, 2024, 11:13 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక  6 గ్యారెంటీలతో  ప్రభుత్వం కొన్ని పథకాలతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా  కొత్త రేషన్ లబ్ధిదారులకు వీటి కోసం ఎలాంటి వివరాలు అందించాలి అనే సందేహాలు ఏర్పడ్డాయి. 

అందులో ఒకటి పెళ్లి తర్వాత జీవిత భాగస్వామి పేరుతో ఆధార్‌ను రెన్యూవల్ చేసుకునే విధానాలు ఏమిటి ? ఇలా చాల మందికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. 

జీవితంలో అన్ని రంగాల్లో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది . బ్యాంకు ఖాతాలు తెరవడం లేదా సిమ్ కార్డులు పొందడం వంటి ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఆధార్ అవసరం. ఆధార్‌లోని సమాచారాన్ని సరైన సమయంలో సరిచేయడానికి ప్రభుత్వం విస్తృతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఒకరి వివాహానంతరం జీవిత భాగస్వామి పేరుతో ఆధార్‌ను రెన్యూవల్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్‌లో ఇంటి పేరును మార్చుకునే స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి....

స్టెప్ 1: వివాహానంతరం  జీవిత భాగస్వామి ఇంటిపేరుతో ఆధార్ కార్డులను పునరుద్ధరించుకోవడానికి పెళ్ళైన జంట  కలిసి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి.

స్టెప్ 2: ఆధార్ సేవా కేంద్రంలో వీరికి  రెన్యూవల్ ఫారమ్ ఇవ్వబడుతుంది. పూర్తి పేరు, ఆధార్ నంబర్, కాంటాక్ట్ నంబర్ ఇంకా జీవిత భాగస్వామి ఇంటి పేరును అందించడం వంటి మార్పులతో సహా వివరాలను ఎంటర్ చేయండి.

స్టెప్ 3: ఫారమ్‌ను సరిగ్గా నింపిన తర్వాత, వివాహ ధృవీకరణ పత్రం వంటి డాకుమెంట్స్ అందించాలి. లేదా చట్టబద్ధంగా గుర్తింపు పొందిన పేరు మార్పు సర్టిఫికేట్ ఇవ్వాలి. గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ జారీ చేసిన దరఖాస్తుదారు ఫోటోతో తగిన లెటర్‌హెడ్‌పై గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని కూడా డాకుమెంట్ గా అందించవచ్చు.

స్టెప్  4: తర్వాత, బయోమెట్రిక్ డేటా అండ్ ఫోటోగ్రాఫ్ రికార్డ్ చేయబడతాయి. కన్ఫర్మేషన్ తర్వాత చిన్న ఛార్జ్ వసూలు చేయబడుతుంది.  తరువాత ఆధార్ కొన్ని రోజుల్లో జారీ చేయబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios