ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్‌లోనూ వచ్చే ఏడాది నుంచి వాణిజ్య ప్రకటనలు కన్పించనున్నాయి. సోషల్ మీడియాలో మనకు కనిపించే యాడ్స్ వాట్సాప్ ‘స్టేటస్’లో ఐవోఎస్ వినియోగదారులకు దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు డబ్ల్యూఏబీటా ఇన్ఫో వరుస ట్వీట్ల ద్వారా సంగతిని తెలిపింది.
ముంబై: ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్‌లోనూ వచ్చే ఏడాది నుంచి వాణిజ్య ప్రకటనలు కన్పించనున్నాయి. సోషల్ మీడియాలో మనకు కనిపించే యాడ్స్ వాట్సాప్ ‘స్టేటస్’లో ఐవోఎస్ వినియోగదారులకు దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు డబ్ల్యూఏబీటా ఇన్ఫో వరుస ట్వీట్ల ద్వారా సంగతిని తెలిపింది. ‘ఐవోఎస్ యాప్‌లో యాడ్స్ ప్రారంభించేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది’ అని ట్వీట్ చేసింది. ది న్యూస్ వెబ్ సంస్థ కూడా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపింది. ‘వాట్సాప్‌లో యాడ్స్‌ను పొందుపరచడానికి ఫేస్‌బుక్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది.’ అని ట్వీట్ చేసింది. వాట్సాప్ సహ వ్యవస్థాపకులు బ్రెయిన్ యాక్టన్, జాన్ కోమ్‌కు ప్రకటనల ద్వారా సంపాదన ఆర్జించాలని ఆలోచన లేదు.
ఇలా వాట్సప్ సేవలు ప్రారంభం
దీంతో వాట్సాప్ సహ వ్యవస్థాపకులు బ్రెయిన్ యాక్టన్, జాన్ కోమ్ ‘నో యాడ్స్, నో గేమ్స్, నో జిమ్మిక్స్’ అనేది వీరి నినాదంతో ఇన్నాళ్లూ యాడ్స్ రహిత వాట్సాప్ సేవలను అందించారు. కానీ, వాట్సాప్‌ను ఫేస్‌బుక్ 22మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడంతో ఈ సమీకరణాలన్నీ మారిపోయాయి. వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ మరిన్ని ఫీచర్లను తీసుకురానున్నది. డార్క్ మోడ్, స్వైప్ టూ రిప్లై’ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్ ‘స్వైప్ టు రిప్లై’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
సంక్షోభంలో దేశీయ ఆర్థిక సంస్థలు
దేశ ఆర్థిక రంగ సంస్థలు సంక్షోభంలో కురుకుపోతున్నాయా? అంటే తాజా పరిస్థితులు నిజమేనంటున్నాయి. వారం రోజులుగా ఆర్థిక రంగ సంస్థ ఒకటి తిరిగి చెల్లింపులు జరుపడంలో మూడుసార్లు విఫలం కావడంతో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దేశీయ బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీటిపై అనుమానాలు ఉదృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న 1,500 చిన్న మధ్యతరహా ఆర్థిక సేవల సంస్థల లైసెన్స్‌లను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీలపై కఠిన నిబంధనలను అమలుచేస్తున్న రిజర్వు బ్యాంకు ప్రతినిధి ఈ లైసెన్స్ రద్దుపై స్పందించడానికి నిరాకరించారు. దీంతో స్వల్ప మొత్తంలో రుణాలు తీసుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనకతప్పదని ఆ వర్గాలు తెలిపాయి.
నిధుల చెల్లింపులో చతికిల పడ్డ ఐఎల్ఎఫ్ఎస్
దేశంలో మౌలిక రంగానికి అధికంగా నిధులు సమకూర్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్(ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) తిరిగి చెల్లింపుల విషయంలో విఫలంకావడంతో అనుమానాలు తీవ్రతరమయ్యాయి. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపై కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. దేశీయంగా ఉన్న 11,400 సంస్థలు రూ.22.1 లక్షల కోట్ల మేర బ్యాలెన్స్ షీట్ కలిగివున్నాయి. ఇప్పటికే రూ.10.8 లక్షల కోట్ల మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకింగ్ రంగ సంస్థలకు ఎన్‌బీఎఫ్‌సీల రూపంలో మరో షాక్ తగులబోతున్నదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
