WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇకపై మీ ప్రియురాలితో చేసిన చాటింగ్‌కు లాక్ వేసే చాన్స్..
WhatsApp కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది, దీని సహాయంతో యూజర్లు తమ రహస్య చాట్‌లను లాక్ చేయవచ్చు. అంటే, మీరు మీ గర్ల్‌ఫ్రెండ్‌తో చేసిన చాట్ ఎవరికీ తెలియకుండా లాక్ చేసే చాన్స్ ఉంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఓ ఫీచర్ ను వాడుకలోకి తేబోతోంది. గత కొన్ని వారాలుగా వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌కి వేగంగా అప్‌డేట్‌లను తీసుకువస్తోంది. కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఇప్పుడు WhatsApp మీ గోప్యతకు సంబంధించిన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. వాట్సాప్ వినియోగదారులు కొన్నేళ్లుగా ఇలాంటి ఫీచర్‌ను డిమాండ్ చేస్తున్నారు. WhatsApp కొత్తగా ఇప్పుడు మీ చాట్‌లను లాక్ చేసే ఫీచర్‌ను అందించబోతోంది.
వ్యక్తిగత చాట్ లాక్ చేసే చాన్స్..
ఇందులో కొత్తదనం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు వాట్సాప్ యాప్‌ను మాత్రమే లాక్ చేయగలరు, కానీ ఇందులో మీరు ఎంపిక చేసుకున్న వ్యక్తితో చేసుకున్న చాట్‌ను లాక్ చేయగలరు. యాప్ లాక్ అనేది ఎవరికైనా పాస్‌వర్డ్, పిన్ లేదా ప్యాటర్న్ తెలిస్తే ఎవరైనా మీ చాట్‌ని యాక్సెస్ చేయవచ్చు కానీ ఇప్పుడు అది జరగదు. Wabatinfo నివేదిక ప్రకారం, ఇప్పుడు మీరు WhatsAppలో ఏదైనా వ్యక్తిగత చాట్‌ని కూడా లాక్ చేయవచ్చు.
Wabetainfo కూడా ఈ WhatsApp యొక్క ఈ ఫీచర్ గురించి ఒక ట్వీట్ చేసింది, దీనిలో ఈ చాట్ లాక్ ఫీచర్ ఎలా పని చేస్తుందో కనిపిస్తుంది. వాట్సాప్ అప్‌డేట్‌లు రాబోయే ఫీచర్‌లపై నిఘా ఉంచే Wabatinfo అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, వాట్సాప్ ఈ ఫీచర్‌పై పనిచేస్తోంది, ఇది చాట్‌లను విడిగా లాక్ చేయడానికి పని చేస్తుంది.
అయితే ఈ చాట్ లాక్ ఫీచర్ ఎలా ఉపయోగించాలో ఇంకా తెలియరాలేదు. దీనికి పాస్‌వర్డ్ ఉంటుందా లేదా అనేది తెలియదు. ఈ ఫీచర్ కొంతమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలో ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. దీని తర్వాత ఇది iOS వినియోగదారుల కోసం విడుదల కూడా అప్ డేట్ విడుదల చేయనున్నారు. వాట్సాప్ చాట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేశారు. దీని అర్థం ఎవరూ హ్యాక్ చేయలేరు.