మరికొద్దిరోజుల్లో బడ్జెట్ 2024.. ఈసారి కొత్త పన్ను మినహాయింపులు ఇస్తారా? ఎం ఆశించవచ్చంటే..

కొత్త తగ్గింపులను ప్రవేశపెడతారా లేదా ఆదాయపు పన్ను విధానాన్ని సవరిస్తారా అనేది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.
 

What Nirmala has in store for taxpayers in Union Budget; Will new tax breaks be given and existing ones tightened?-sak

ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయోనని పన్ను చెల్లింపుదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొత్త తగ్గింపులను ప్రవేశపెడతారా లేదా ఆదాయపు పన్ను విధానాన్ని సవరిస్తారా అనేది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల మూడో వారంలో  బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో పన్నుకు సంబంధించిన కొన్ని ప్రకటనలు, అలాగే వాటి వల్ల ఉండే సవాళ్లు ఏంటో చూద్దాం...

80C మినహాయింపు: సెక్షన్ 80C కింద ప్రస్తుతం ఉన్న రూ.1.5 లక్షల పరిమితి కొన్ని సంవత్సరాలుగా మారలేదు. అయితే, ఈసారి పెంచే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, రేట్లు పెరుగుతున్నప్పటికీ సెక్షన్ 80C పరిమితి 2014 నుంచి మారలేదు.

హోమ్ లోన్ పై వడ్డీ: సెక్షన్ 24B కింద రూ.2 లక్షల వరకు వడ్డీ మొత్తానికి మినహాయింపులు అనుమతిస్తారు. వడ్డీ రూ.2 లక్షలలోపు ఉంటే పూర్తి మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని రూ.3లక్షలకు పెంచుతారని మరో అంచనా. 

స్టాండర్డ్ డిడక్షన్: నిపుణుల ప్రకారం.. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారుల కోసం స్టాండర్డ్ డిడక్షన్‌లో మార్పులకు అవకాశం ఉంది. ప్రస్తుతం పాత, ఇంకా  కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున ఈ పరిమితిలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని పలువురు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios