Asianet News TeluguAsianet News Telugu

UKలో ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది ? భారీగా వేతనం వచ్చే ఉద్యోగాలు ఇవే..

UKలో అధిక డిమాండ్ ఉన్న అనేకం ఉద్యోగాలు ఉన్నాయి. అవేంటో ఇఫ్పుడు మనం తెలుసుకుందాం. 

What jobs are in demand in UK These are the high paying jobs
Author
First Published Nov 20, 2023, 8:27 PM IST

UK ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2022 నాటికి, ఇంగ్లండ్ లో నివసిస్తున్న ఆరుగురిలో ఒకరు స్థానికేతరులు ఉన్నారు.  వీరిలో అత్యధికులు భారతీయులే. అలాగే 2022లో భారతీయులకు అనేక UK వీసాలు  జారీ చేసింది.  UKలో అధిక డిమాండ్ ఉన్న అనేకం ఉద్యోగాలు ఉన్నాయి. అవేంటో ఇఫ్పుడు మనం తెలుసుకుందాం. 

హెల్త్ కేర్ నిపుణులు: కోవిడ్ తర్వాత, చాలా దేశాలు ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరతతో బాధపడుతున్నాయి. ఈ జాబితాలో నర్సులు, ఫార్మసిస్ట్‌లు, కేర్ వర్కర్లు , హోమ్‌కేర్ ప్రొవైడర్లు కూడా ఉన్నారు. మీరు నైపుణ్యం కలిగిన హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ అయితే, మీరు స్కిల్డ్ వర్కర్ వీసా స్కీమ్ కింద UKలో పని చేయడానికి అర్హులు. ఈ వీసా UKలో 5 సంవత్సరాల వరకు నివసించడానికి మరియు పని చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 

ఇంజనీర్లు: సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు మరియు డిజైన్ మరియు డెవలప్‌మెంట్ ఇంజనీర్‌లకు UK యొక్క సాంప్రదాయ ఇంజనీరింగ్ రంగాలలో అధిక డిమాండ్ ఉంది. డిగ్రీ లేదా పని అనుభవం కలిగి ఉండటం అటువంటి ఉద్యోగాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

IT నిపుణులు: సాఫ్ట్ వేర్, IT నిపుణులకు యూకేలో మంచి డిమాండ్ ఉంది. ఏటా  ఈ రంగంలో 5,200 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. అదే సమయంలో, 39.6% మంది కార్మికులు పదవీ విరమణ చేస్తున్నారు.  ప్రోగ్రామర్లు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నిపుణుల కోసం, యూకేలో 49,600 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఏటా ఈ  రంగంలో 12,500 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇదే కాలంలో పదవీ విరమణ చేస్తున్న కార్మికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 1,18,900 ఉద్యోగాలు రెడీ అవుతున్నాయి. 

ఆర్థికవేత్తలు: ఆర్థికవేత్తలు, గణాంకవేత్తలకు యూకేలో మంచి డిమాండ్ ఉంది. భీమా, ఆర్థిక రంగంలో వీరికి మంచి ఉపాధి రాబడి ఉంది. 2027 నాటికి, ఈ రంగంలో ఉపాధి వృద్ధి 4.3% ఉంది. ఏటా 1,800 కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో సృష్టిస్తున్నారు. అదే సమయంలో, 55.3% మంది కార్మికులు పదవీ విరమణ చేయనున్నారు, దీనితో 23,200 ఉద్యోగాలు సృష్టించబడతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios