అఖరి క్షణాల్లో పెళ్లిని (Wedding) రద్దు చేసుకోవాలని, పెళ్లి తేదీని మార్చాలని గానీ ఎవరూ కూడా కోరుకోరు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా.. ఏమి చేయలేని స్థితిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో ఆర్థిక నష్టాన్ని నివారించడానికి.. మీరు ముందుగా వివాహ బీమాను (Wedding Insurance) ఎంచుకోవచ్చు.
భారత్‌లో 2020 మార్చిలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించారు. దీంతో చాలా వివాహ కార్యక్రమాలు చివరి క్షణాల్లో రద్దయ్యాయి. ప్రభుత్వ ఆంక్షలు, కరోనా కేసులు కారణంగా చాలా వరకు పెళ్లిళ్లు నిలిచిపోయాయి. మరికొన్ని బంధువులు, కుటుంబ సభ్యులు లేకపోవడంతో వాయిదా పడ్డాయి. అయితే ఈ ఏడాది విషయానికి వస్తే నవంబర్, డిసెంబర్లో పెళ్లిళ్ల సీజన్ ముగింది. రానున్న జనవరి, ఫ్రిబవరి నెలల్లో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ రానుంది. ఇప్పటికే చాలా మంది ఆ నెలల్లో ముహుర్తాలు కూడా ఖరారు చేసుకని ఉంటారు. అయితే ప్రస్తుతం దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ వ్యాప్తి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా పెరిగి పరిస్థితులు అనకూలించకపోతే.. వివాహాలన రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అయితే అటువంటి సమయంలో ఆర్థిక నష్టాన్ని నివారించడానికి.. మీరు వివాహ బీమాను (Wedding Insurance) ఎంచుకోవచ్చు. అఖరి క్షణాల్లో పెళ్లిని రద్దు చేసుకోవాలని, పెళ్లి తేదీని మార్చాలని గానీ ఎవరూ కూడా కోరుకోరు. అయితే కొన్ని పరిస్థితులు (ముఖ్యంగా కరోనా పరిస్థితులు) ప్రభావం వల్ల ఏమి చేయలేని స్థితిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
అయితే వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనేది మీ వివాహ బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇన్సురెన్స్‌పై చార్జ్ చేయబడే ప్రీమియం విషయానికి వస్తే.. బీమా హామీ మొత్తంలో 0.7 నుంచి 2 శాతం మధ్యలో ఉంటుంది. ఒకవేళ.. మీరు రూ.10 లక్షల వివాహ బీమా పొందినట్లయితే.. రూ.7,500 నుంచి 15,000 వరకు ప్రీమియం చెల్లించాలి. వివాహాన్ని రద్దు చేయడం, ఏదైనా ఇతర నష్టం జరిగితే వెడ్డింగ్ ఇన్సూరెన్స్ భారీగా ఖర్చులను కవర్ చేస్తుంది. అయితే వెడ్డింగ్ ఇన్సురెన్స్.. నాలుగు కేటగిరిలో విభిన్న పరిస్థితులను కవర్ చేస్తుంది.
లయబిలిటీస్ కవరేజ్- వివాహ వేడుకల సమయంలో ఏదైనా ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీకి నష్టం జరిగితే ఈ విభాగం కవర్ చేస్తుంది.
రద్దు కవరేజ్- వివాహాన్ని ఆకస్మికంగా లేదా ఊహించని విధంగా రద్దు చేయడం వల్ల కలిగే నష్టాన్ని ఈ విభాగం కవర్ చేస్తుంది.
ప్రాపర్టీ డ్యామేజ్- ఇది వివాహ సమయంలో ఆస్తి దెబ్బతినడం, నష్టం జరగడం నుంచి రక్షిస్తుంది.
వ్యక్తిగత ప్రమాదం- పెళ్లి కూతరు గానీ, పెళ్లి కుమారుడు గానీ ప్రమాదాలకు గురైతే.. ఆస్పత్రి ఖర్చులను కవర్ చేస్తుంది.
వివాహ బీమా కింది ఖర్చులకు కవరేజి ఇస్తుంది..
-క్యాటరింగ్ కోసం ఇచ్చిన అడ్వాన్స్
-వివాహ వేదిక కోసం ఇచ్చిన అడ్వాన్స్
-ట్రావెల్ ఏజెన్సీలకు ఇచ్చే అడ్వాన్స్
-హోటల్ రూమ్స్ బుకింగ్‌కు ఇచ్చే అడ్వాన్స్
-వివాహ ఆహ్వాన పత్రికల ప్రిటింగ్‌కు అయ్యే ఖర్చు
-మ్యూజిక్ అండ్ డెకరేషన్‌కు ఇచ్చే అడ్వాన్స్
-డెకరేషన్, వెడ్డింగ్ సెట్స్‌కు అయ్యే ఖర్చు.
పెళ్లి కార్యక్రమంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే.. మీరు వెంటనే దాని గురించి బీమా కంపెనీకి తెలియజేయాలి. దీని తర్వాత.. వాస్తవాలను నిర్ధారించడానికి బీమా కంపెనీ విచారణ చేస్తుంది. చెల్లుబాటు అయ్యే కారణం వల్ల మీరు నష్టాన్ని చవిచూస్తే.. మీకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించబడుతుంది.
అయితే టెర్రరిస్ట్ దాడి, సమ్మె/పౌర అశాంతి, వరుడు/వధువు కిడ్నాప్, దుస్తులు, వివాహ అతిథుల వ్యక్తిగత ఆస్తులను కోల్పోవడం, వివాహ వేదిక ఆకస్మికంగా అందుబాటులో లేకపోవడం, వాహనాలు దెబ్బతినడం, వివాహ వేదిక దెబ్బతినడం, ధ్వంసం చేయడం, పాలసీదారు సూచనలు, నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఆస్తి నష్టం.. వంటి సందర్భాల్లో వివాహ బీమా క్లెయిమ్‌లను స్వీకరించదు.