సారాంశం

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ మళ్లీ వార్తల్లో నిలిచారు. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉండడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని స్వయంగా లలిత్ మోదీ ట్వీట్ ద్వారా తెలియజేశారు. వ్యాపార రంగంలో లలిత్ మోదీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆస్తులు విలువ ఎంతో తెలుసుకుందాం. 

లలిత్ మోదీ వ్యాపార కుటుంబానికి చెందినవారు. అతని తాత గుజర్మల్ మోడీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో మోడీనగర్ అనే పారిశ్రామిక పట్టణాన్ని స్థాపించారు. అతని ఎనిమిది మంది పిల్లలలో ఒకరు లలిత్ మోడీ తండ్రి కెకె మోడీ. లలిత్ మోడీ తన తండ్రి స్థాపించిన కెకె మోడీ కంపెనీకి చైర్మన్ గా ఉన్నారు.  అతని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్, ఫేస్‌బుక్ పేజీ కూడా అతన్ని మోడీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్‌గా పేర్కొంటున్నాయి.

మోడీ ఎంటర్‌ప్రైజెస్ అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ కంపెనీ FMCG, నెట్‌వర్క్ మార్కెటింగ్, విద్య, వినోదం, టీ, ఇతర పానీయాలు, ఆరోగ్య సంరక్షణ, ఫ్యాషన్, ఆహారం, ఆసుపత్రి రంగాలలో పనిచేస్తుంది. భారత్‌తో పాటు, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆఫ్రికా వంటి అనేక దేశాల్లో మోడీ గ్రూప్‌కు వ్యాపారం ఉంది.

లలిత్ మోదీ ఆస్తుల విలువ: 
IPL 2008లో ప్రారంభమైంది. నేడు ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ లీగ్‌లలో ఒకటి. దీన్ని విజయవంతం చేసిన ఘనత చాలా వరకు లలిత్ మోదీకే దక్కుతుంది. అయితే మనీలాండరింగ్ ఆరోపణలతో లలిత్ మోదీ 2010లో దేశం విడిచి పారిపోయారు. అతను ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. ఒక అంచనా ప్రకారం లలిత్ మోడీ ఆస్తులు దాదాపు 57 మిలియన్ డాలర్లు అంటే రూ.4,555 కోట్లు. అతను లండన్ యొక్క ఐకానిక్ 117 స్లోన్ స్ట్రీట్‌లో ఐదు అంతస్తుల ఇంటిని కలిగి ఉన్నాడు. ఇది 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 

నటి సుస్మితా సేన్ కూడా  దాదాపు ఏటా 9 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ప్రతి నెలా 60 లక్షల రూపాయలు సంపాదిస్తుందని తేలింది. సుస్మితా సేన్ నికర విలువ దాదాపు 74 కోట్ల రూపాయలు. ముంబైలోని వెర్సోవాలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో సుస్మిత తన దత్తపుత్రికలతో కలిసి నివసిస్తోంది. సుస్మితా సేన్ దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె వద్ద BMW 7 సిరీస్ 730Ld ఉంది. దీని ధర 1.42 కోట్ల రూపాయలు. ఆమె వద్ద BMW X6 కూడా ఉంది. దీని ధర 1 కోటి రూపాయలు. ఇంకా, ఆడి క్యూ7 ప్రారంభ ధర దాదాపు రూ. 89.90 లక్షలు, లెక్సస్ ఎల్‌ఎక్స్ 470 ధర రూ. 35 లక్షలు అని మీడియాలో వార్తలు వచ్చాయి.  

సుస్మితా సేన్ ఆదాయ వనరులు ఇవే : 
మీడియా కథనాల ప్రకారం, మిస్ వరల్డ్ అయిన సుస్మిత యొక్క ప్రధాన ఆదాయ వనరు సినిమా. సుస్మిత ఒక సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటుంది. అలాగే సుస్మిత బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ.1.5 కోట్లు అందుకోనుంది. సుస్మిత బెంగాలీ మాషిస్ కిచెన్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించింది. సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లలో నటించడమే కాకుండా, సుస్మితా సేన్ తంత్ర ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా నడుపుతోంది. సుస్మితా సేన్‌కి దుబాయ్‌లో నగల దుకాణం ఉంది.