Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమా పొందేందుకు ఉన్న ఇబ్బందులు ఏంటి..? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ?

సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమా పొందడం అంత సులభం కాదు, అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

What are the difficulties for senior citizens to get health insurance How to solve this problem MKA
Author
First Published Oct 26, 2023, 12:38 AM IST | Last Updated Oct 26, 2023, 12:38 AM IST

సాధారణంగా సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమా పొందడం ఎందుకు కష్టం, వృద్ధాప్యం దానితో పాటు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వారిని వెంటాడుతుంటాయి. అందువల్ల, వృద్ధులకు ఆరోగ్య కవరేజ్ ప్లాన్ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. కానీ సమస్య ఏమిటంటే సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం అంత సులభం కాదు. అయితే కొన్ని స్టెప్స్  తీసుకోవడం ద్వారా వృద్ధులకు ఆరోగ్య కవరేజీని ఏర్పాటు చేసుకోవచ్చు.

వృద్ధులకు ఆరోగ్య బీమాకు అడ్డంకులు ఇవే..
ఇటీవలి సర్వే ప్రకారం, దేశంలోని 98 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులకు ఆరోగ్య బీమా కవరేజీ లేదు. ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేటప్పుడు సీనియర్లు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లలో ఒకటి వయస్సుతో పాటు పెరుగుతున్న ప్రీమియం భారం. బీమా కంపెనీలు తరచుగా బీమా చేసిన వ్యక్తి వయస్సును బట్టి అధిక ప్రీమియంలను వసూలు చేస్తాయి. ఈ వయస్సు-ఆధారిత ప్రీమియంలు సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కవరేజీని కొనుగోలు చేయడాన్ని మరింత ఖరీదుగా మారుస్తాయి. ఈ కారణంగా, చాలా మంది వృద్ధులు ఆరోగ్య బీమాకు దూరం అవుతున్నారు. 

సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
చాలా బీమా కంపెనీలు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ప్రారంభించాయి. ఈ ఆరోగ్య బీమా పథకాలు సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే రూపొందించారు. ఇలాంటి ప్లాన్‌ల గురించిన సమాచారాన్ని పొందడం ద్వారా, మీ కుటుంబంలోని పెద్దల కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేయవచ్చు.

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లు ఒక వ్యక్తికి బదులుగా మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమాను అందిస్తాయి. చాలా సార్లు, సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక ఆరోగ్య కవరేజీని అందించడానికి నిరాకరించే కంపెనీలు కూడా వారిని ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లో కవర్ చేయడానికి అంగీకరిస్తాయి. మీ ఇంట్లోని తల్లిదండ్రులను ఇందులో జోడించినప్పుడు ఇటువంటి ప్లాన్‌ల ప్రీమియంలు తరచుగా పెరుగుతున్నప్పటికీ, సీనియర్ సిటిజన్‌లు ఆరోగ్య బీమా   ఫ్యామిలీ గ్రూపు్ కవరేజ్ కింద కవర్ అవుతారు. 

గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్
గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్  సాధారణంగా ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం అందజేస్తుంది. ఇందులో ఉద్యోగితో పాటు అతని మొత్తం కుటుంబం కూడా కవర్ అవుతుంది. అయితే, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అతిపెద్ద లోపం ఏమిటంటే, దాని ప్రయోజనాలు మీరు ఉద్యోగం చేసేంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. చాలా కంపెనీలు టాప్-అప్ ద్వారా గ్రూప్ మెడికల్ ప్లాన్ కవరేజీని పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. మీ కుటుంబంలోని పెద్దల కోసం మీకు ఏ ఇతర కవరేజీ లేకపోతే, కంపెనీ అందించే డిఫాల్ట్ కవరేజీ తక్కువగా ఉంటే, మీరు దానిని టాప్-అప్ ద్వారా పెంచుకోవడం బెస్ట్ ఆప్షన్ గా పరిగణించవచ్చు.

మీరు ఏ ప్రైవేట్ రంగ ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందలేకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం, ఇది పేద మరియు ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఆసుపత్రిలో చేరే చికిత్స కోసం సంవత్సరానికి రూ.1000 అందజేస్తారు. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం కల్పిస్తారు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) ప్రయోజనాలను పొందవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios