అభినవ దానకర్ణుడు...పేదల కోసం 38 వేల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేసిన వారెన్ బఫెట్...
స్టాక్ మార్కెట్ ప్రపంచంలో అతిపెద్ద ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తాజాగా తన సంపదలో 38 వేల కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే ఆయన సంపాదించిన దాంట్లో 99% షేర్లను విరాళంగా ఇచ్చేస్తానని ప్రకటించిన వారిని బఫెట్ దశలవారీగా తన ప్లాన్ ను అమలు చేస్తున్నారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన వారెన్ బఫెట్ తన పెట్టుబడి సంస్థ బెర్క్‌షైర్ హాత్వేలో 4.64 బిలియన్ డాలర్ల ( సుమారు 38 వేల కోట్ల రూపాయలు) విలువైన షేర్లను విరాళంగా ఇచ్చారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో సహా ప్రపంచంలోని ఐదు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు దీని నుండి ప్రయోజనం పొందనున్నాయి. అదనంగా, వారెన్ బఫెట్ తన కంపెనీ మొత్తం షేర్లలో 51 శాతం విరాళంగా ఇచ్చాడు. ఈ విరాళం బఫెట్ పెట్టుబడి సంస్థ బెర్క్‌షైర్ హాత్వే వార్షిక వాటాల ఉపసంహరణలో భాగంగా ఉంది. ఇది ఆయన అందించిన అతిపెద్ద వార్షిక విరాళం, ఇందులో బెర్క్‌షైర్ క్లాస్ B కు చెందిన 13.7 మిలియన్ షేర్లు ఉన్నాయి.
ఎవరీ వారెన్ బఫెట్
92 ఏళ్ల వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పెట్టుబడిదారు. స్టాక్ మార్కెట్‌లో ఆయన నైపుణ్యం గురించి యావత్ ప్రపంచంలో అభిమానులు ఉన్నారు. షేర్ మార్కెట్లో అవకాశాలను పసిగట్టి దాని నుంచి ఆదాయం ఎలా పొందాలో వారెన్ బఫెట్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఆయన సంస్థ బెర్క్‌షైర్ హాత్వే, అమెరికాతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి.
వారెన్ బఫెట్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, అతని నికర విలువ 117.3 బిలియన్ యుఎస్ డాలర్లు. అతను బెర్క్‌వే హాత్వే చైర్మన్, ఇది కోకా-కోలా, యాపిల్, పెప్సీతో సహా అనేక పెద్ద కంపెనీలలో వాటాలను కలిగి ఉన్నారు. పెట్టుబడి నైపుణ్యం కారణంగా అయనను 'ఒరాకిల్ ఆఫ్ ఒమాహా' అని పిలుస్తారు. వారెన్ బఫెట్ తన సంపదలో 99 శాతం కంటే ఎక్కువ విరాళంగా ఇస్తానని ఇప్పటికే చెప్పడం విశేషం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, అతను ఇప్పటి వరకు దాదాపు 51 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ ను, ఎక్కువగా గేట్స్ ఫౌండేషన్, సహా ఇతర ఫౌండేషన్‌లకు విరాళంగా ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా వారెన్ బఫెట్ తన 51వ పుట్టినరోజు తర్వాత వాల్ స్ట్రీట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా తన సంపదలో ఎక్కువ భాగం సంపాదించాడు.
ఏ సంస్థకు ఎంత డబ్బు:
అతని ఇటీవలి వార్షిక విరాళంలో ఎక్కువ భాగం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు వెళ్లింది. ఈ కంపెనీ 39 బిలియన్ డాలర్ల విలువైన 1.45 మిలియన్ షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదనంగా, సుసాన్ థామ్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు 1.5 మిలియన్ షేర్లు కేటాయించనున్నారు.
గేట్స్, బఫెట్ స్నేహం: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బెర్క్‌షైర్ హాత్వే CEO వారెన్ బఫెట్ మంచి స్నేహితులు. ఎక్కువ సమయం వారు కలిసి ఉంటారు. బఫ్ఫెట్ తన బెర్క్‌షైర్ హాత్వే షేర్లలో ఎక్కువ భాగాన్ని బిల్ గేట్స్, అతని మాజీ భార్య మెలిండా కలిసి ఏర్పాటు చేసిన 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్'కి విరాళంగా ఇచ్చాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పేదరికం, వ్యాధి, అసమానతలను నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తుంది.