ఐపీవో ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా...అయితే 80 ఐపీవోలు సిద్ధం..మంచి ఐపీవోలను ఎలా గుర్తించాలి..

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బుల్ రన్ కొనసాగిస్తోంది.  రోజురోజుకు మార్కెట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతీయులతో పాటు, విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును భారతీయ మార్కెట్లలో నిరంతరం పెట్టుబడి పెడుతున్నారు. ఈ గోల్డెన్ పీరియడ్ మార్కెట్‌లో కంపెనీలన్నీ ఈ లాభాలలో మునిగి  తేలుతున్నాయి. ఇటీవలి నివేదిక ప్రకారం, ప్రస్తుతం 80 కంపెనీలు తమ IPOను భారత స్టాక్ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఇ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్, టాటా గ్రూప్‌కు చెందిన ఇతర స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. 

Want to make money through IPO but 80 IPOs are ready how to identify good IPOs MKA

బ్రోకరేజ్ కంపెనీ IIFL సెక్యూరిటీస్ తాజా నివేదిక ప్రకారం, IPOల జాబితా చాలా పెద్దది అనే చెప్పాలి.  చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కంపెనీలు ఉన్నాయి. పెద్ద కంపెనీల గురించి చెప్పాలంటే, ఇందులో టాటా గ్రూప్‌కు చెందిన టాటా టెక్నాలజీస్ కూడా ఉంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఓ IPO ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.  అదనంగా, బీమా సంస్థ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్, నెట్‌వెబ్ టెక్నాలజీస్ మరియు గో డిజిట్ ఇన్సూరెన్స్‌తో సహా 80 కంపెనీలు ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లను (ఐపిఓలు) ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. 

మూడు నెలలుగా ఐపీఓ మార్కెట్ జోరందుకుంది 

గత మూడు నెలలుగా ఐపీఓ మార్కెట్ పుంజుకుంటోందని కంపెనీ చైర్మన్ నిపున్ గోయల్ తెలిపారు. మ్యాన్‌కైండ్ ఫార్మా IPO ద్వారా ప్రైమరీ మార్కెట్లో సందడి ప్రారంభం అయ్యింది.  కంపెనీ రూ.4,326 కోట్ల IPOతో క్యాపిటల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత మరో ఐదు ఐపీఓలు వచ్చాయి. రాబోయే నాలుగైదు వారాల్లో అనేక IPOలు రానున్నాయి. 

వివిధ రంగాలకు చెందిన కంపెనీలు IPOలకు సిద్ధమవుతున్నాయి 

టెక్నాలజీ, ఇన్సూరెన్స్, రిటైల్ వంటి వివిధ రంగాలకు చెందిన కంపెనీలు IPO మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దాదాపు 80 కంపెనీలు IPO కోసం డ్రాఫ్ట్ ఆఫర్ పత్రాన్ని దాఖలు చేశాయి. రాబోయే కొద్ది నెలల్లో వాటిలో చాలా వరకు మార్కెట్‌లోకి వస్తాయని  నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీలలో ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, స్నాప్‌డీల్, టాటా టెక్నాలజీస్, నెట్‌వెబ్ టెక్నాలజీస్,. గో డిజిట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఆర్థిక సేవలు, ఆరోగ్యం, తయారీ రంగం సహా పలు రంగాల్లో  ఐపీఓలకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. 

 ఐపిఓలో పెట్టుబడి  పెట్టేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

 స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే కంపెనీ ఐపీఓ ద్వారా ప్రవేశిస్తుంది.  దీని ప్రైమరీ మార్కెట్ అంటారు.  కంపెనీ ఆఫర్ చేసిన ధర రేంజ్ లో షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ షేర్లను లాట్ అని అంటారు. ఒక్కో లాట్ లో  నిర్ణీత మొత్తంలో షేర్లు ఉంటాయి.  కంపెనీ ఎన్ని షేర్లు కొనాలో ముందుగానే ఐపిఓ నోటిఫికేషన్ లో సూచిస్తుంది.  గరిష్టంగా కూడా ఎంత పెట్టుబడి పెట్టవచ్చో నోటిఫికేషన్లో చెబుతారు. దీన్ని బట్టి మీరు కనిష్టం నుంచి గరిష్టం వరకు లాట్ లపై బిడ్ వేయవచ్చు. అయితే  ఎవరికైతే షేర్లు అలాట్ అవుతాయో  వారి డిమాట్ అకౌంట్ లో షేర్లు జమ అవుతాయి. మిగతా వారికి డబ్బు వాపస్ అవుతుంది. . షేర్లు లిస్టింగ్ జరిగిన రోజు  మీ షేర్లను సెకండరీ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. తద్వారా లాభం పొందే అవకాశం ఉంది.  లేదా కంపెనీ షేర్లను హోల్డ్ చేయవచ్చు. సాధారణంగా ఐపీఓ లో పెట్టుబడి పెట్టేవారు కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలను బేరీజు వేసుకోవాలి. అలాగే ఆ కంపెనీకి ఉన్న బ్రాండ్ నేమ్  పై కూడా అధ్యయనం చేయాలి. అప్పుడే మీరు ఐటీవో మార్కెట్లో రాణించగలరు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios