Asianet News TeluguAsianet News Telugu

నెలకు రూ. 1 లక్ష పింఛను కావాలా ? మ్యూచువల్ ఫండ్ SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి ?

పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందడానికి మీరు మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి, లాంటి సమాచారాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. కాబట్టి ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష సంపాదిస్తే. పెన్షన్ పొందడానికి 30 సంవత్సరాల పాటు మ్యూచువల్ ఫండ్ SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలో ? ఇక్కడ సమాచారం తెలుసుకుందాం. 
 

Want 1 lakh pension How much to invest in mutual fund SIP
Author
First Published Sep 5, 2022, 12:29 PM IST

ఉద్యోగ విరమణ తర్వాత జీవితం గురించి ఆలోచించడం, ఉద్యోగం వచ్చిన వెంటనే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. నేటికీ చాలా మంది దీన్ని చేస్తున్నారు. అయితే, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? మీరు పెట్టుబడి పెడితే ఎంత పెన్షన్ పొందవచ్చు? ఈ లెక్కలు కొన్ని తెలియక కొందరు తికమకపడగా.. మరికొందరు ఆలోచించకుండా పెట్టుబడి పెడుతున్నారు.

అయితే మ్యూచువల్ ఫండ్ నెలవారీ SIPలో పెట్టుబడి పెడితే  మీకు రూ. 1 లక్ష పింఛను పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఒక ఉదాహరణతో చూద్దాం. ప్రకాష్ అనే 30 ఏళ్ల ఉద్యోగి రూ.1 లక్ష పెన్షన్ సంపాదించేందుకు సహాయపడే స్కీం కోసం వెతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ లాంటి ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ప్రకాష్‌కు 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. మ్యూచువల్ ఫండ్స్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అనేది ప్రకాష్ లేదా మరేదైనా ఇతర పెట్టుబడిదారులకు పెట్టుబడి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడే నెలవారీ చెల్లింపు పద్ధతి. 

పెన్షన్ కాలిక్యులేటర్ ఇలా ఉంటుంది
నెలకు రూ.1 లక్ష పెన్షన్ లక్ష్యం చేరుకోవాలంటే రిటైర్‌మెంట్ ఫండ్‌ను SWP (సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్)లో పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్టర్ హైబ్రిడ్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ SWP ఫండ్‌ని ఎంచుకోవచ్చు. ఇది 7-8% వార్షిక రాబడిని పొందడానికి సహాయపడుతుంది. పదవీ విరమణ అనంతర ద్రవ్యోల్బణాన్ని సంవత్సరానికి 6% వద్ద ఉంచినట్లయితే, పెట్టుబడిదారునికి రూ.1 లక్ష పెన్షన్ పొందడానికి SWPకి 2.76 కోట్లు. మదుపు చేయాలి. వచ్చే 30 ఏళ్లలో 2.76 కోట్ల రూపాయలతో పింఛను పొందాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే, అతను తన వార్షిక ఆదాయంలో 10 శాతం మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి. 

పెట్టుబడిదారుడు 30 సంవత్సరాల పాటు మ్యూచువల్ ఫండ్స్ SIPలో పెట్టుబడి పెడితే, పెట్టుబడిదారుడు 15 శాతం రాబడిని ఆశించవచ్చు. ఈ విధంగా, 30 సంవత్సరాల తర్వాత, పెట్టుబడిదారుడు పెట్టుబడిపై 15 శాతం రాబడిని ఆశించవచ్చు. 

SIP కాలిక్యులేటర్
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వ్యక్తి దీర్ఘకాలంలో 15 శాతం రాబడిని ఆశించవచ్చు. ఒక వ్యక్తి రూ. 2.76 కోట్లు మదుపు చేయాలనుకుంటే, అతను ప్రతి సంవత్సరం SIPని 10 శాతం పెంచాలి. మ్యూచువల్ ఫండ్ 15 శాతం వార్షిక రాబడిని ఇస్తోంది. మీరు ప్రతి సంవత్సరం SIPని 10 శాతం పెంచుతున్నట్లయితే, మీరు 30 సంవత్సరాల వయస్సులో రూ. 2,200తో SIPని ప్రారంభించాలి. పెట్టుబడిదారుడు 30 ఏళ్లలో రూ.43,42,642 ఇన్వెస్ట్ చేస్తాడు. 30 ఏళ్ల తర్వాత అతని మొత్తం పెట్టుబడి రూ.2,35,94,709కి పెరుగుతుంది. SBI కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ ఈక్విటీ,కోటక్ డెట్ హైబ్రిడ్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఈ కలను సాకారం చేసుకోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios