హెచ్‌డీఎఫ్‌సీతో వాల్‌మార్ట్‌ జత: ‘బెస్ట్‌ ప్రైస్‌' కస్టమర్లకు క్రెడిట్‌ కార్డు

అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఇండియా.. బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జత కట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా హోల్‌సేల్‌ ‘బీ2బీ క్యాష్‌ అండ్‌ క్వారీ’ సేవలు అందిస్తున్న బెస్ట్‌ ప్రైస్‌ వినియోగదారులకు క్రెడిట్‌ కార్డును అందించనున్నది.

Walmart launches credit card in partnership with HDFC Bank


హైదరాబాద్: అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఇండియా.. బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జత కట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా హోల్‌సేల్‌ ‘బీ2బీ క్యాష్‌ అండ్‌ క్వారీ’ సేవలు అందిస్తున్న బెస్ట్‌ ప్రైస్‌ వినియోగదారులకు క్రెడిట్‌ కార్డును అందించనున్నది.

ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై 18 రోజుల నుంచి 50 రోజుల వరకు ఎప్పుడైనా చెల్లింపులు జరుపవచ్చునని వాల్‌మార్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈవో క్రిశ్‌ అయర్‌ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 26 హోల్‌సేల్‌ స్టోర్లలో ఒకేసారి ఈ కార్డును విడుదల చేసినట్లు చెప్పారు. 

బెస్ట్‌ ప్రైస్‌ ఖాతాదారులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వాల్‌మార్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈవో క్రిశ్‌ అయర్‌ చెప్పారు. ఈ కార్డు తీసుకున్న వారు ఎంతైన షాపింగ్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు.

2019 ఆర్థిక సంవత్సరంలో ‘బిగ్‌ బాస్కెట్‌’కు పెరిగిన నష్టాలు

మరోవైపు వ్యాపార విస్తరణలో భాగంగా ఏపీలోని కర్నూల్‌లో ఏర్పాటు చేసిన హోల్‌సేల్‌ స్టోర్‌ను వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు వాల్‌మార్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈవో క్రిశ్‌ అయర్‌ ప్రకటించారు. ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ రిటైల్‌ రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు.

ప్రపంచ మార్కెట్లో భారత్‌ అన్ని విభాగాల్లో దూసుకుపోతున్నదని వాల్‌మార్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈవో క్రిశ్‌ అయర్‌ పేర్కొన్నారు. ఈ కో-బ్రాండెడ్‌ కార్డుపై రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ లభించనున్నదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతినిధి పరాగ్‌ రావు తెలిపారు. రెండు రకాల్లో లభించనున్న ఈ కార్డుపై ఏడాదికి రూ.1,000 వరకు ఫీజును వసూలు చేస్తున్నట్లు చెప్పారు.. క్రెడిట్‌ కార్డు చెల్లింపులు ఉచితం.. ప్రీమియం పేమెంట్లపై ఎల్‌ఐసీ ప్రకటన

డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే ప్రీమియం చెల్లింపులపై విధించనున్న చార్జీలను ఈ నెల 1 నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దీంతో క్రెడిట్‌ కార్డు ద్వారా రెన్యూవల్‌ ప్రీమియం, నూతన ప్రీమియం లేదా రుణాల చెల్లింపులు, పాలసీలపై తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులపై అదనపు రుసుంను వసూలు చేయరు.

ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్...

కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక క్రెడిట్‌ కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలను ఉచితంగా జరుపుకోవచ్చు. వీటితోపాటు కార్డు రహిత చెల్లింపులు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషిన్ల వద్ద కార్డు డిప్‌/స్వైప్‌ ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు భారం పడదని ఎల్ఐసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే వినియోగదారుడు ‘మైఎల్‌ఐసీ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునని సూచించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios