వాల్‌మార్ట్ లక్ష్యం: ఫ్లిప్‌కార్ట్ తర్వాత వంతు భారత్ స్టార్టప్‌లదే!

Walmart Labs is mostly looking for acqui-hires and niche tech-product start-ups in India
Highlights

వాల్‌మార్ట్ ల్యాబ్స్.. అంతర్జాతీయంగా అతిపెద్ద రిటైలర్ జెయింట్ ‘వాల్‌మార్ట్’ అనుబంధ సంస్థ. ఇంతకుముందు వాల్‌మార్ట్ భారతదేశంలోని ఈ - కామర్స్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’లో అత్యధిక వాటాను స్వాధీనం చేసుకున్నది..


శాన్‌ఫ్రాన్సిస్కో: వాల్‌మార్ట్ ల్యాబ్స్.. అంతర్జాతీయంగా అతిపెద్ద రిటైలర్ జెయింట్ ‘వాల్‌మార్ట్’ అనుబంధ సంస్థ. ఇంతకుముందు వాల్‌మార్ట్ భారతదేశంలోని ఈ - కామర్స్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’లో అత్యధిక వాటాను స్వాధీనం చేసుకున్నది.. తాజాగా భారతదేశంలోని టెక్నాలజీ సంస్థల స్వాధీనం దిశగా అడుగులేస్తున్నది. మే నెలలో వాల్‌మార్ట్‌లో 77 శాతం వాటా (16 బిలియన్ల డాలర్లు)ను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. 

అయితే భారతదేశంలోని టెక్నాలజీ సంస్థలు అతి చిన్న సైజుల్లోనే ఉంటాయి కనుక వాటిలో నైస్ టెక్ ఉత్పత్తులు ‘స్టార్టప్’లను స్వాధీనం చేసుకునే దిశగా వాల్‌మార్ట్ ల్యాబ్ అడుగులేస్తున్నది. స్వాధీనం, ఉద్యోగ నియామకాల పద్దతిలో ఈ స్టార్టప్ సంస్థల కొనుగోళ్లు సాగనున్నాయి. అందులో భాగంగా స్టార్టప్‌ల కొనుగోలుకు నిధులు ఖర్చు చేయడంతోపాటు వ్యవస్థాపకులు, కీలక ఉద్యోగులకు ఉద్యోగాలివ్వనున్నది. 

వాల్ మార్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జెరెమి కింగ్ మాట్లాడుతూ మర్చండైజింగ్, మెషిన్ లెర్నింగ్ నిపుణులపై ద్రుష్టి సారించా. కాంపిటిటివ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్ వేదికపైనే ఫోకస్ పెట్టాం’ అని చెప్పారు. వాల్‌మార్ట్ ల్యాబ్స్ బెంగళూరులో 2011లో సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాల్‌మార్ట్ ల్యాబ్స్ మూడు ప్రధాన కేంద్రాల్లో ఒకటి. నాటి నుంచి బెంగళూరులోని వాల్ మార్ట్ ల్యాబ్స్ సంస్థ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వాల్ మార్ట్ యాజమాన్యంలోని రిటైల్ చైన్ శామ్య్ క్లబ్, బ్రిటన్ సూపర్ మార్కెట్ చైన్ ఆస్డా తదితర సంస్థల్లో సాఫ్ట్‌వేర్, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్, సప్లయి చెయిన్ సిస్టమ్స్, టెక్ వర్క్ తదితర విభాగాల్లో పని చేసేవారికి చెల్లింపులు జరుపుతోంది. 

భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా గల తన ల్యాబ్‌ల్లో రెండు వేల మంది ఇంజినీర్లను నియమించనున్నది. బెంగళూరులోని వాల్‌మార్ట్ ల్యాబ్స్ అధిపతిగా హరి వాసుదేవ్‌ను నియమించుకున్నది. బెంగళూరులోని ఫ్లిప్‌కార్ట్ నుంచి హరి వాసుదేవ్‍ను నియమించుకున్నది వాల్‌మార్ట్ ల్యాబ్స్. ప్రస్తుతం వాల్‌మార్ట్ ల్యాబ్స్ డేటా సైన్స్ యాక్టింగ్ హెడ్‌గా హరి వాసుదేవ్ పని చేస్తున్నారు. బెంగళూరులోని మరింత మంది సీనియర్ టెక్కీలను నియమించుకోనున్నది. 

వాల్‌మార్ట్ ల్యాబ్స్ గ్లోబల్ యాక్టింగ్ చీఫ్‌గా హరి వాసుదేవ్ మాట్లాడుతూ బెంగళూరు సంస్థలో కేవలం 30 మందితో కూడిన టీం పని చేసేది. ప్రస్తుతం మేం వందల మందికి చేరుకున్నాం. మేం మర్చండైజింగ్ అండ్ సప్లయి చైన్ ఎక్స్ పీరియన్స్ గల మెషిన్ లెర్నింగ్ నిపుణులను నియమించుకున్నాం, డేటా సైన్స్, క్లౌడ్ నిపుణులను, అత్యున్నత స్థాయి ఇంజినీర్లను నియమించుకున్నాం. వారితో కొన్ని ఉత్పత్తులు కూడా తయారు చేశాం’ అని చెప్పారు. 

ఫ్లిప్ కార్టు కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత తాము స్టార్టప్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ చేపడతామని వాల్‌మార్ట్ గ్లోబల్ యాక్టింగ్ హెడ్ హరి వాసుదేవ్ అన్నారు. ఈ మేరకు వాల్‌మార్ట్ ల్యాబ్స్ ఇప్పటి నుంచే ఇండియన్ ఆన్‌లైన్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ టెక్నాలజీ టీంతో సన్నిహితంగా పని చేస్తున్నామని చెప్పారు. 

loader