ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ స్టోర్స్ కంపెనీ భారతదేశంలో కొత్త స్టోర్ల విస్తరణను ఆపివేయాలని యోచిస్తోంది. అలాగే అందులో పనిచేసే సిబ్బందిని కూడా తగ్గించడానికి చూస్తుంది అని ఒక ఇంగ్లిష్ పత్రిక  తెలిపింది. వాల్మార్ట్ ఇంక్. కంపెనీ భారతదేశంలో తమ ఉన్నత అధికారులను తొలగించడానికి సన్నాహాలు చేస్తోందని  స్థానిక మీడియా తెలిపింది.

also read   సంక్రాంతికి మళ్ళీ బంగారం ధర పెరగొచ్చు...ఎందుకింత డిమాండ్...?

ఇప్పటికే వివిధ విభాగాలలో ఉన్న వైస్ ప్రెసిడెంట్స్ ఇంకా మరికొందరిని తేసివేసింది. కొత్త స్టోర్ల కోసం ప్రదేశాలను కనుగొనే బాధ్యత కలిగిన రియల్ ఎస్టేట్ బృందాన్ని కూడా రద్దు చేసింది.అర్కాన్సాస్‌కు చెందిన బెంటన్‌విల్లే సంస్థ తన ఫిజికల్ అపరేషన్స్ లో ఫ్యూచర్ గ్రోత్ చూడలేకపోతుంది.

2018 లో 16 బిలియన్ డాలర్లకు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ దీనిని తిసుకొచ్చింది. ప్రస్తుతం దీనిని అమ్మకానికి లేదా  ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేసే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.విదేశీ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల కఠినమైన నియంత్రణ కోసం రాజకీయ ఒత్తిడి ఇప్పుడు పెరుగుతోంది. 

also read పైసల్లేక ఆర్బీఐపై ఒత్తిళ్లు.. అదనపు డివిడెండ్ కోసం కేంద్రం

వాల్‌మార్ట్ గత ఏడాది ఏప్రిల్ లో తన హోల్‌సేల్ వ్యాపారాన్ని విస్తరించాలని కోరుకుంటుందని,రాబోయే నాలుగేళ్లలో అవుట్‌లెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని అనుకుంటుందని అన్నారు.కానీ ఆ ప్రణాళికలు ఇప్పుడు బెడిసికొట్టాయి, ఈ విషయంపై ప్రతిస్పందనగా ఒక పత్రికకు ఆ మాటలు "అర్దంలేనివి ఇక  అబద్ధం" అని కంపెనీ తెలిపింది.