Asianet News TeluguAsianet News Telugu

ఐఫోన్ ధరకే వివో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా పవర్ ఫుల్ కెమెరాతో ఫీచర్స్ పై లుక్కెయండీ..

వివో ఎక్స్90 బ్రీజ్ బ్లూ అండ్ ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు, వివో ఎక్స్90 ప్రొ లెజెండ్ బ్లాక్ కలర్‌లో పరిచయం చేయబడింది.

Vivo new flagship phone launched with 120W fast charging and powerful camera, know the price
Author
First Published Feb 6, 2023, 3:47 PM IST

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ వివో ఎక్స్90 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ ని గ్లోబల్ మార్కెట్‌లో కూడా ప్రవేశపెట్టింది. వివో ఎక్స్90 అండ్ వివో ఎక్స్90 ప్రొ వివో ఎక్స్90 సిరీస్‌ కింద  వస్తున్నాయి. Zeiss బ్రాండింగ్‌తో కూడిన ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కెమెరా అండ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వివో ఎక్స్90 ప్రొ 50-మెగాపిక్సెల్ Sony IMX 989 సెన్సార్, మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌ ఉంది. రెండు ఫోన్‌లు గొప్ప డిస్‌ప్లే ఇంకా 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను పొందుతాయి. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల ధర అండ్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం...

వివో ఎక్స్90 సిరీస్ ధర
వివో ఎక్స్90 బ్రీజ్ బ్లూ అండ్ ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు, వివో ఎక్స్90 ప్రొ లెజెండ్ బ్లాక్ కలర్‌లో పరిచయం చేయబడింది. వివో ఎక్స్90 ధర MYR 3,699 అంటే సుమారు రూ. 71,600, వివో ఎక్స్90 ప్రొ ధర MYR 4,999 అంటే సుమారు రూ. 96,800. రెండు ఫోన్‌లు సింగిల్ స్టోరేజ్ 12జి‌బి + 256 జి‌బి స్టోరేజ్‌లో వస్తాయి. ఇండియాలో ఫోన్‌ లాంచ్ చేయడం గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు.

వివో ఎక్స్90 ప్రొ స్పెసిఫికేషన్ అండ్ కెమెరా 
వివో ఎక్స్90 ప్రొ 6.78-అంగుళాల పూర్తి-HD + AMOLED డిస్‌ప్లే ఉంది, 1,260x 2,800 పిక్సెల్‌ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ ఆక్టా-కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్, 12 GB LPDDR5X RAMతో 256 GB స్టోరేజీకి సపోర్ట్ ఇస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఫోన్‌లో వివో కస్టమ్ V2 చిప్ కూడా ఉంది. 

వివో ఎక్స్90 ప్రొ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫోన్ f/1.75 ఎపర్చరుతో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 989 1-అంగుళాల ప్రైమరీ సెన్సార్, f/1.6 ఎపర్చర్‌తో 50 మెగాపిక్సెల్ 50mm IMX758 సెన్సార్, 12 మెగాపిక్సెల్ f/2.0 ఎపర్చరు లెన్స్ IMXtrawide సెన్సార్‌తో IMXtraw3ని పొందుతుంది. సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్ కోసం, ఫోన్ f/2.45 ఎపర్చరు లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెన్సార్‌  ఉంది. 

వివో ఎక్స్90 ప్రొ 256GB UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో వస్తుంది, మెమొరీ కార్డ్ ఉండదు. ఫోన్ లో 4,870mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్, కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, GPS అండ్ USB టైప్-సి పోర్ట్‌లకు సపోర్ట్ ఉంది. ఫోన్ బయోమెట్రిక్ అతేంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా డస్ట్ అండ్ వాటర్ రిసిస్టంట్ కోసం IP68 రేటింగ్‌  ఉంది.

వివో ఎక్స్90 స్పెసిఫికేషన్ అండ్ కెమెరా 
ప్రో మోడల్ లాగానే వివో ఎక్స్90కి డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ ఇంకా 12జి‌బి LPDDR5X ర్యామ్‌తో కూడా అందిస్తున్నారు. వివో ఎక్స్90 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌  పొందుతుంది, ఇందులో f/1.75 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ Sony IMX 866 ప్రైమరీ సెన్సార్, f/1.98 ఎపర్చర్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ 50mm పోర్ట్రెయిట్ కెమెరా ఇంకా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంది.

సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌తో f/2.45 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 32-మెగాపిక్సెల్  ఫ్రంట్ కెమెరా ఉంది. Pro అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ Vivo X90తో కూడా ఉన్నాయి. ఫోన్ 4,810mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios