క్రికెట్‌ రికార్డులను తిరగరాయడంలోనే కాదు బ్రాండ్ విలువలోనూ టీమిండియా సారధి విరాట్‌ కోహ్లినే రారాజు. 170.9 మిలియన్ల డాలర్ల బ్రాండ్ విలువతో వరుసగా రెండో ఏడాది కోహ్లి తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. దేశంలో అత్యధిక బ్రాండు విలువల గల  ప్రముఖుడిగా అగ్ర తాంబూలాన్ని అందుకున్నాడు. 2017తో పోలిస్తే కోహ్లి బ్రాండ్ విలువ 18 శాతం పెరగడం గమనార్హం.

2018లో  గ్లోబల్‌ వ్యాల్యూయేషన్‌, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ అడ్వయిజర్స్‌ సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ రూపొంచిందిన నివేదిక బ్రాండ్ విలువలో విరాట్ కోహ్లీదే అగ్రస్థానమని తెలిపింది. బ్రాండ్ విలువ ఆధారంగా గా అత్యుత్తమ 20 మంది ప్రముఖులకు ర్యాంకులు ఇచ్చింది. కోహ్లి తర్వాతి స్థానంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే నిలిచారు. షారూక్‌ ఖాన్‌ను వెనక్కినట్టి ఈ స్థానాన్ని ఆమె చేజిక్కించుకున్నారు. షారూక్‌ ఖాన్‌ ఈ ఏడాది ఐదో స్థానానికి పడిపోయారు.

విరుష్క ఒంటరిగా 24 భార్యతో 40 బ్రాండ్ల ప్రచారకర్త
2018 నవంబర్ నెలాఖరు నాటికి విరాట్‌ కోహ్లి చేతిలో 24 బ్రాండ్ల ప్రకటన ఒప్పందాలు ఉన్నాయి. తన భార్య అనుష్క శర్మతో కలిసి 40 బ్రాండ్లకు కోహ్లి ప్రచారకర్తగా ఉన్నారు.

విరాట్, దీపిక బ్రాండ్ విలువ 100 మి.డాలర్ల పైమాటే 
మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విరాట్ కోహ్లి, దీపికా పదుకొనేల బ్రాండు విలువ మినహా మిగిలిన వారెవరిది కూడా 100 మిలియన్ల డాలర్ల మైలురాయిని దాటలేదు. అగ్రస్థానంలో ఉన్న కోహ్లికి.. రెండో స్థానంలో నిలిచిన దీపికాకు ఎండోర్స్‌మెంట్‌ల సంఖ్య విషయంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. కోహ్లి కంటే మూడు బ్రాండ్లు తక్కువగా ఆమె 21 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు.

బాలీవుడ్‌ నటులదే పైచేయి
అత్యుత్తమ 20 మంది సెలబ్రిటీల్లో ఎక్కువ మంది బాలీవుడ్‌ నటులు కాగా.. ఆ తర్వాత స్థానాల్లో ఎక్కువగా క్రీడాకారులే ఉన్నారు. అత్యుత్తమ 20 మంది సెలబ్రిటీల మొత్తం బ్రాండు విలువ 899 మిలియన్‌ డాలర్లు. ఇందులో మూడొంతులు అంటే 75 శాతం వరకు తొలి 10 స్థానాల్లో ఉన్నవారి చేతిలోనే ఉంది.

క్రీడాకారులకు 27% బ్రాండ్ 
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న క్రీడాకారుల్లో కోహ్లి, సచిన్‌, ధోని, పి.వి.సింధు ఉన్నారు. వీరి మొత్తం బ్రాండు విలువ 241 మి.డాలర్లు. అత్యుత్తమ 20 మంది బ్రాండు విలువలో క్రీడాకారుల మొత్తం బ్రాండు విలువ 27 శాతానికి పైగానే.

‘జంట’బ్రాండ్లకు జేజేలు
ఇటీవల వివిధ సంస్థలు తమ బ్రాండ్ల ప్రచారకర్తలుగా ‘జంట’లను ఎండార్స్‌ చేసే ధోరణి బాగానే పెరిగింది. ఈ విషయంలో విరుష్క జంట ముందు వరుసలో ఉంది. 2018లో విరాట్‌, అనుష్క కలిసి 40 బ్రాండ్లకు ఎండార్స్‌ చేశారు. వీటిల్లో హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌, మాన్యవార్‌, పెప్సీ, సెల్‌కాన్‌, బూస్ట్‌, ఆడి, ఫాస్ట్‌ట్రాక్‌ లాంటి బ్రాండ్లు ఉన్నాయి. ‘జంట ప్రచార’ ఒరవడికి కంపెనీలు కూడా జే కొడుతున్నాయి.