Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ నుంచి కన్నీళ్లతో వైదొలిగిన విజయ గద్దె...పండగ చేసుకుంటున్న ట్రంప్ అభిమానులు, భారత్ లోనూ పలువురు హర్షం

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన వెంటనే మైక్రో బ్లాగింగ్ సైట్ సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, పాలసీ హెడ్, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దెను తమ పదవుల నుంచి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది.  మస్క్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Vijaya Gadde left Twitter in tears Trumps fans are celebrating many are cheering in India too
Author
First Published Oct 28, 2022, 7:08 PM IST

ఎలాన్ మస్క్ ట్విట్టర్  ను టేకోవర్ చేసుకోగానే ఆ కంపెనీ నుంచి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న వ్యక్తులలో ఒకరైన విజయ గద్దె గతంలో అనేక కారణాల వల్ల వివాదాలలో ఉన్నారు. భారత్‌కు చెందిన విజయ గద్దె తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళ కావడం విశేషం. 

హైదరాబాద్‌లో జన్మించిన విజయ గద్దె గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను నిషేధించాలని నిర్ణయించిన ట్విట్టర్ కమిటీలో కీలకంగా ఉన్నారు. అప్పుడు ఆమెపై ట్రంప్ అభిమానులు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు 2018లో ట్విట్టర్ సీఈవో భారత పర్యటన సందర్బంగా, ఆమె భారత్‌కు సంబంధించిన ఓ సున్నితమైన విషయంలో తలదూర్చి విజయ గద్దె బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. 

ట్విట్టర్ సీఈజాక్ డోర్సే భారత్ పర్యటనలో వివాదం 
నిజానికి, ఆ సమయంలో ట్విట్టర్ CEO జాక్ డార్సీ తన భారత పర్యటన సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో బ్రాహ్మణవాదాన్ని అంతం చేయండి  అని రాసి ఉన్న ఒక ప్లకార్డును పట్టుకుని కనిపించారు. దీని వెనుక విజయ గద్దె ఉన్నారని నెటిజన్లు ఆరోపించారు. దీనికి  విజయ గద్దె బాధ్యత వహించి బహిరంగ ప్రకటన చేశారు. వివాదం ముదిరిపోవడంతో విజయ గద్దె వరుస ట్వీట్లతో క్షమాపణలు చెప్పింది. 
 
బోర్డు సమావేశంలో విజయ గద్దె విలపించారు
మీడియా నివేదికల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌లో, ఎలోన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విటర్ పనిచేసే విధానాన్ని మార్చవచ్చనే భయంతో, ట్విట్టర్ బోర్డు సమావేశంలో గద్దె భావోద్వేగానికి గురయ్యారు. వార్తా సంస్థ ది హిల్‌కి సీనియర్ ఎడిటర్ కన్జర్వేటివ్ వ్యాఖ్యాత సాగర్ ఎన్‌జెటి, ట్విట్టర్ ఉద్యోగులతో ఎలోన్ మస్క్‌ను ట్విటర్ టేకోవర్ చేయడం గురించి చర్చిస్తున్నప్పుడు విజయ గద్దె విరుచుకుపడ్డారని ఓ కథనాన్ని ట్వీట్ చేశారు.

ట్విట్టర్ టాప్ లీడర్‌షిప్ టీమ్ నుండి విజయ గద్దెను తప్పించాలని ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పలువురు ప్రశంసిస్తూ, ఆయనను సమర్థిస్తున్నారు. దూబే అనే న్యాయవాది ట్విట్ చేస్తూ, అప్పటి CEO జాక్ డోర్సేతో JNU విద్యార్థుల సమావేశం ఏర్పాటు వెనుక విజయ గద్దె ఉందని ఆరోపించారు. ఒక నిర్దిష్ట మతానికి సంబంధించిన అకౌంట్లను నిషేధించడం, ట్విటర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నిషేధించడం వెనుక విజయ గద్దె ఉందని కూడా పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.  మస్క్‌ని విజయ గద్దెను ట్విట్టర్ నుండి తొలగించి అధికారికంగా ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios