Asianet News TeluguAsianet News Telugu

విజయ్‌ మాల్యాకు మరిన్ని చిక్కులు... 2.58 లక్షల పౌండ్ల సీజ్ కు ఎస్బీఐ అనుమతి

విజయ్ మాల్యా లండన్‌లో విలాస జీవితం గడుపుతున్నాడని ఎస్బీఐ తరఫు న్యాయవాది యునైటెడ్ కింగ్ డమ్ కోర్టులో వాదించారు. ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ యూకే పీఎల్పీ ఖాతా నుంచి 2.58 లక్షల పౌండ్లను సీజ్ చేసేందుకు అనుమతించాలని లండన్ కోర్టును ఎస్బీఐ అభ్యర్థించింది.
 

Vijay Mallya may have to curb his $24,000-a-week London life
Author
New Delhi Railway Station, First Published Apr 4, 2019, 3:12 PM IST

లండన్‌: బ్యాంకులకు రూ వేల కోట్లు రుణాల ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ఇప్పటికీ లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడని బ్రిటన్‌ కోర్టుకు ఎస్బీఐ నివేదించింది. మాల్యాకు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ యూకే పీఎల్సీ ఖాతా నుంచి 2,58,000 పౌండ్లను సీజ్‌ చేసేందుకు లండన్‌ కోర్టును ఎస్‌బీఐ అనుమతి కోరింది.

ఉద్దేశపూర్వకంగానే రుణాల చెల్లింపునకు మాల్యా నిరాకరణ
మరోవైపు తమ క్లయిట్‌ ప్రస్తుతం వారానికి 18,300 పౌండ్లు ఖర్చు చేస్తుండగా, ఖర్చును నెలకు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు అంగీకరించారని మాల్యా న్యాయవాది ఎస్బీఐకి తెలపడంతో ఎస్‌బీఐ ఈ అంశాన్ని బ్రిటన్‌ కోర్టుకు తెలిపింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాలను చెల్లించేందుకు మాల్యా ఉద్దేశపూర్వకంగానే నిరాకరిస్తున్నాడని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి.

కింగ్ పిషర్ యూరప్ యూనిట్ నుంచి 7500 పౌండ్ల ఆదాయం
లగ్జరీ లైఫ్‌ను అనుభవించే విజయ్‌ మాల్యా ఇప్పటికీ విలాస జీవితం గడుపుతున్నాడని ఎస్‌బీఐ న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మాల్యాను చూస్తుంటే ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని తెలుస్తోందన్నారు. మాల్యాకు కింగ్‌ఫిషర్‌ బీర్‌ యూరప్‌ లిమిటెడ్‌ నుంచి ప్రతినెలా 7500 పౌండ్ల ఆదాయం సహా ట్రస్టుల ద్వారా నడుస్తున్న కుటుంబ ఆస్తుల నుంచి కూడా ఆయనకు భారీగా ఆదాయం సమకూరుతోందని ఎస్బీఐ న్యాయవాదులు పేర్కొన్నారు.

మహీంద్రా @ 30 లక్షల ట్రాక్టర్లు 
మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) కీలక మైలురాయిని అధిగమించింది. ఈ కంపెనీ ట్రాక్టర్ల అమ్మకాలు 30 లక్షలు దాటాయి. గత నెలతో ఈ ఘనత సాధించామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. 2018-19లో మహీంద్రా రెండు లక్షలకు పైగా ట్రాక్టర్లను ఉత్పత్తి చేసింది. 

1963లో ట్రాక్ట్రర్ల ఉత్పత్తి ప్రారంభం
1963లో ఇంటర్నేషనల్‌ హార్వెస్టర్‌ ఇంక్‌ భాగస్వామ్యంతో ట్రాక్టర్ల తయారీని మహీంద్రా ప్రారంభించింది. 2004లో పది లక్షల ట్రాక్టర్ల ఉత్పత్తి మైలురాయిని దాటింది. 2009లో ప్రపంచంలో అత్యధిక ట్రాక్టర్ల విక్రయ బ్రాండ్‌గా అవతరించింది. 2013 సంవత్సరంలో 20 లక్షల ట్రాక్టర్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. 

ఆరేళ్లలో 10 లక్షల ట్రాక్టర్లు ఉత్పత్తి
2009 నుంచి ఇప్పటివరకు ఆరేళ్లలోనే మరో 10 లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి (ఎగుమతులు సహా) చేయడం విశేషం. 30 లక్షల ట్రాక్టర్ల మైలురాయి అనేది కస్టమర్లకు మహీంద్రా ట్రాక్టర్‌ బ్రాండ్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఎం అండ్‌ ఎం ఫార్మ్‌ ఎక్విప్ మెంట్ సెక్టార్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ జెజురికర్‌ పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios