కరోనా వైరస్ పై పోరులో భాగంగా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి నిన్న నిర్మల సీతారామన్ తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి సూక్ష్మ,, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన ఆర్ధిక ప్యాకేజి వివరాలను ప్రకటించారు. 

ఇలా నిర్మల సీతారామన్ నిన్న సాయంత్రం ఆర్ధిక ప్యాకేజీలో తొలి భాగాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే విజయ్ మాల్యా స్పందించాడు. కరోనా పై పోరులో ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన ప్రభుత్వానికి అభినందనలు చెబుతూనే.... తన కేసును క్లోజ్ చేయమని కోరాడు. 

"ప్రభుత్వం ఎంతకావాలంటే... అంత కరెన్సీని ముద్రించుకోవచ్చని, కాకపోతే తనలాంటి ఒక చిన్న చెల్లింపుదారుడు పూర్తిగా చెల్లిస్తాను అన్నప్పటికీ ఇలా పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు సబబు? నేను పూర్తిగా 100 శాతం బ్యాంకులకు బాకీపడ్డ సొమ్మును చెల్లిస్తాను, దయచేసి ఆ డబ్బును చెల్లించి కేసును క్లోజ్ చేయండి" అని కోరాడు. 

ఇకపోతే ఈ ఫిబ్రవరిలో కూడా విజయ్ మాల్యా తాను డబ్బును చెల్లిస్తానని ఇలాంటి ఆఫరే బ్యాంకుల ముందు ఉంచాడు. లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యాను అప్పగించాలని భారత్ బ్రిటన్ ను కోరింది. ఇందుకు అక్కడి కోర్టు కూడా అంగీకరించింది. 

ఆ తీర్పును సవాల్ చేస్తూ  బ్రిటిష్ హైకోర్టులో మాల్య పిటిషన్ వేశాడు.64 ఏళ్ల మాజీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత తాను బ్యాంకు రుణాలలో చెల్లించని  9,000 కోట్ల రూపాయలు, మనీలాండరింగ్ ఆరోపణలపై భారతదేశంలో కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)  అకారణంగా తనపై చర్యలు తీసుకుంటున్నాయి అని ఆరోపించారు.

"నేను నా రెండు చేతులతో బ్యాంకులను వేడుకుంటున్న, నేను రుణపడి ఉన్న మొత్తంలో 100% వెంటనే వెనక్కి తీసుకోండి" అని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ వెలుపల ఫిబ్రవరిలో అన్నారు.

"బ్యాంకులు నేను తీసుకున్న రుణాలు చెల్లించడం లేదని చేసిన ఫిర్యాదుపై ఇడి ఆస్తులను జత చేసింది. పిఎమ్‌ఎల్‌ఎ (మనీలాండరింగ్ నివారణ చట్టం) కింద నేను ఏ నేరాలకు పాల్పడలేదు. దయచేసి బ్యాంకులు మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి" అని ఆయన అన్నారు.

భారతదేశానికి తిరిగి వెళ్తార అని అడిగినప్పుడు, "నేను నా కుటుంబం ఎక్కడ ఉండాలో, నాకు ఎక్కడ ప్రయోజకరంగా ఉంటుందో అక్కడ నేను ఉంటాను" అని గతంలో సమాధానం ఇచ్చారు.