అతి త్వరలోనే Google Pay లాగే X (ట్విట్టర్) ద్వారా పేమెంట్  చేసే అవకాశం..ఇక చకచకా డబ్బు పంపేయొచ్చు..

ఎలాన్ మస్క్ త్వరలో X ప్లాట్‌ఫారమ్‌లో పేమెంట్ ఫీచర్‌ను విడుదల చేయబోతున్నారు, కంపెనీ త్వరలో X చెల్లింపుల ఫీచర్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు చెల్లింపులు చేసుకోగలుగుతారు. వాట్సాప్‌తో సహా పలు యాప్‌లలో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

Very soon the possibility to make payment through X (Twitter) like Google Pay..Services will start soon MKA

 

ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్) పేమెంట్  సేవలను త్వరలో  ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే  గూగుల్ జీపే పేరుతో  పేమెంట్ సేవలను అందిస్తుండగా,  పలు యాప్స్ పేమెంట్ సర్వీసులను అందిస్తున్నాయి. అలాగే ఫేస్ బుక్ సైతం వాట్సాప్ ద్వారా పేమెంట్ సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో X కంపెనీ CEO లిండా యాకారినో  తాజా పోస్ట్‌లో కొత్త ఫీచర్ల గురించి సమాచారం అందించారు. యాకారినో పోస్ట్ లో త్వరలోనే ట్విట్టర్ యాప్ లో వీడియో ఆడియో, వీడియో, మెసేజింగ్, పేమెంట్స్, బ్యాంకింగ్ ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు..

Google Pay లాగే మీరు X ద్వారా పేమెంట్  చేయవచ్చు..

కొత్త ఫీచర్‌ను ప్రకటిస్తూ, యాకారినో ఒక వీడియోను కూడా షేర్ చేసారు. అందులో Xకి వచ్చే ఫీచర్ల గురించి సమాచారం  పేర్కొన్నారు.  ఆమె ఈ పోస్టులో పోస్ట్‌లో  చాలా విషయాలు  రాసుకొచ్చారు, రెండు నిమిషాల నిడివిగల వీడియో X కి వచ్చే వివిధ విషయాల గురించి  పేర్కొన్నారు

వీడియో ప్రకారం, పేమెంట్ లు చేయడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కూడా త్వరలో అందుబాటులోకి  తెచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతానికి, మీరు Xలో టెక్స్ట్ ద్వారా మాత్రమే ఇతరులతో కనెక్ట్ అవ్వగలరు. కానీ ఇప్పుడు వీడియో కాలింగ్ నుండి పేమెంట్ లు చేయడం ,  ఉద్యోగాల కోసం వెతకడం వరకు ప్రతిదీ X సహాయంతో చేయవచ్చు.

ఎలాన్ మస్క్ 'ఎవ్రీథింగ్ యాప్'  కాన్సెప్ట్ తో తన ఏళ్ల నాటి కలను సాకారం చేసుకోవడానికి  ప్రస్తుతం ఎక్స్ వేదికను  వాడుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. 'ఎవ్రీథింగ్ యాప్' గా Xని సృష్టించడం గురించి  మస్క్ చాలాసార్లు బహిరంగంగానే పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. అంటే, ఇదే యాప్‌ని ఉపయోగించి, వ్యక్తులు పేమెంట్ లు చేయవచ్చు, అలాగే మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు, ఇతరులతో కనెక్ట్ కావచ్చు. మస్క్ గత సంవత్సరం ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పుడు, అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను చాలా కాలంగా ఎవ్రీథింగ్ యాప్ గా మార్చాలని  ఎలాన్ మాస్క్ అనుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే అతి త్వరలోనే ఎక్స్ లేదా ట్విట్టర్ లో  ఇకపై పలు పెయింట్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు సూత్రప్రాయంగా మాస్క్ తెలపడం విశేషం. ఇంతకాలం ఉచితంగానే పోస్టులను  వేయడం  ద్వారా  కోట్లాదిమంది యూజర్లను పొందినటువంటి ఎక్స్.  అతి త్వరలోనే పూర్తిస్థాయిలో పెయిడ్ సర్వీస్ లను ప్రారంభిస్తుందని  తద్వారా భవిష్యత్తులో ఎవరైనా ట్విట్టర్  సర్వీసులను వాడుకోవాలంటే ఎంతో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు.  ఇలా చేయడం ద్వారా ఫేక్ అకౌంట్ లను అడ్డుకోవచ్చని.  చాట్ బాట్లను కూడా  తొలగించే వీలు దక్కుతుందని,  మస్క్ పేర్కొనడం విశేషం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios