దేశీయ విమాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ అందించింది. కరోనా టీకాలు మొదటి లేదా రెండవ డోస్ వేయించుకున్న వారికి టిక్కెట్ ధరలపై 10 శాతం తగ్గింపును ప్రకటించింది.
దేశంలోని అత్యంత సరసమైన విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో (indigo)కస్టమర్లకు విమాన టికెట్ ఛార్జీలపై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది. యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్ మొదటి లేదా రెండు డోస్‌లను పొందిన వారు విమాన టిక్కెట్ల బేస్ ఫేర్‌పై 10 శాతం తగ్గింపును పొందవచ్చని ఇండిగో ప్రకటించింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రచారాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది.
ఇండిగో ఈ ఆఫర్‌కి వ్యాక్సీ ఫేర్(Indigo Vaxi Fare) అని పేరు పెట్టింది. గత ఏడాది ఆగస్టులో కంపెనీ దీన్ని తొలిసారిగా తీసుకొచ్చింది. ఈ ఆఫర్ భారతదేశంలోని అన్ని దేశీయ విమానాలకు అందుబాటులో ఉంటుంది. బుకింగ్ తేదీ నుండి 15 రోజులకు ముందు ప్రయాణ తేదీలకు ఈ తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ తగ్గింపు పొందడానికి ప్రయాణీకులు ఇండిగో వెబ్‌సైట్ నుండి మాత్రమే టిక్కెట్‌ను బుక్ చేయాల్సి ఉంటుంది.
ఎయిర్‌లైన్ ప్రకారం వాక్సీ ఫేర్ స్కీమ్ కోసం భారత పౌరులుగా ఉన్న 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా సర్టిఫికేట్ చూపడం అవసరం. దీని కోసం ప్రయాణీకులు కేంద్ర ఆరోగ్య అలాగే కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన టీకా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ద్వారా టీకాకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా చూపించవచ్చు. ఒకవేళ ప్రయాణీకుడు సర్టిఫికేట్ అందించడంలో విఫలమైతే టికెట్ కోసం పూర్తి ఛార్జీని చెల్లించవలసి ఉంటుంది.
ఈ విధంగా వాక్సీ ఫెయిర్ స్కీమ్ సద్వినియోగం చేసుకోవచ్చు
-ముందుగా ఇండిగో వెబ్‌సైట్‌లో మీ ప్రయాణ తేదీ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత వాక్సీ ఫెయిర్ ఆప్షన్ ఎంచుకోండి.
-మీరు వ్యాక్సిన్‌లో మొదటి డోస్‌ని పొందారా లేదా రెండవ డోస్ తీసుకున్నారా తెలపండి.
-తరువాత మీకు నచ్చిన ఇండిగో విమానాన్ని ఎంచుకోండి, వన్-వే టిక్కెట్ లేదా రౌండ్-ట్రిప్ ఆప్షన్ ఎంచుకోండి.
-బెనెఫిసియారి ఐడిని సరిగ్గా ఎంటర్ చేయండి. వాక్సీ ఫెయిర్ కోసం చెల్లుబాటు అయ్యే బెనిఫిషియరీ ఐడి తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
-దీని తర్వాత, టిక్కెట్‌పై వాక్సీ ఫెయిర్ ఛార్జీ వర్తిస్తుంది అలాగే బుకింగ్ పూర్తవుతుంది.
