Asianet News TeluguAsianet News Telugu

భారత ఆర్థికరంగం బలంగా పుంజుకుంటోంది: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ఎంటర్ప్టిన్యూయార్షిప్ స్కిల్ డేవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీ  శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రతిస్పందనలకు కృతజ్ఞతలు, దేశం బలమైన ఆర్థిక పురోగతిని ప్రదర్శిస్తోందని అన్నారు.

V Shaped recovery :Minister Rajeev Chandrasekhar on indian Economy Rebound know here
Author
Hyderabad, First Published Sep 2, 2021, 12:46 PM IST

గత మూడు నెలల్లో ఆర్థిక పురోగతికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు గత సంవత్సరంతో పోలిస్తే గ్రాస్ డోమస్టిక్ ప్రాడక్ట్ (జి‌డి‌పి)20 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కరోనావైరస్ లాక్‌డౌన్‌ కారణంగా జిడిపి 24.4 శాతం పడిపోయింది దీంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. 

నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రతిస్పందనలకు కృతజ్ఞతలు భారతదేశం బలమైన ఆర్థిక పురోగతిని ప్రదర్శిస్తోందని ఎంటర్ప్టిన్యూయార్షిప్ స్కిల్ డేవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీ శాఖ కేంద్ర  మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రాయిటర్స్ నిర్వహించిన సర్వేకు అనుగుణంగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డాక్టర్ కె.వి సుబ్రహ్మణ్యం విడుదల చేసిన డేటా ఉంది. కరోనావైరస్ సెకండ్ వేవ్ వల్ల భారతదేశం దెబ్బతిన్నప్పటికీ మూడు నెలల్లో జిడిపి 20 శాతం పెరుగుతుందని 41 మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

1990 మధ్యలో త్రైమాసిక డేటా విడుదల చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇది దేశంలో అత్యంత వేగవంతమైన వృద్ధి అని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. 

 

కార్పొరేట్ పర్ఫర్మెన్స్  గత 5 సంవత్సరాలలో 130 శాతానికి పైగా పెరుగుదలతో గ్రాస్ సేల్స్ అత్యధిక వృద్ధిని ఎలా చూసింది అని కూడా ప్రభుత్వ డేటా చూపిస్తోంది. అలాగే  నెట్ ప్రాఫిట్ గ్రోత్ (31 ఏళ్లలో అత్యధికం) 130 శాతానికి పైగా ఉంది,  చిన్న సంస్థల ఎక్స్పెన్స్ గ్రోత్ (దాదాపు 120 శాతం) సూచిస్తుంది.


భారతదేశ V- ఆకారపు  ఎకనామిక్ రికవరీలో కొన్ని ఇతర ముఖ్య ముఖ్యాంశాలు:

• గ్రాస్ నాన్ పర్ఫర్మింగ్ అసెట్స్  11.2% (మార్చి 2018) నుండి 7.4% (మార్చి 2021) కి తగ్గాయి.
• నెట్ నాన్ పర్ఫర్మింగ్ అసెట్స్ ( NPA) 5.9% (మార్చి 2018) నుండి 2.3% కి (మార్చి 2021) తగ్గింది.
• పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ 62.7% (మార్చి 2018) నుండి 84% (మార్చి 2021)పెరిగింది.
• ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు రూ .31,816 కోట్లకు పెరిగాయి

 

నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే మద్దతు ప్రస్తుత విధానాల కారణంగా కోవిడ్-19 పూర్వ స్థాయిలతో పోలిస్తే వ్యవసాయ రంగం బలంగా అభివృద్ధి చెందిందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

ఈ వృద్ది వేగాన్ని కొనసాగించడానికి భరతదేశం థర్డ్ వేవ్ నివారించడం చాలా కీలకమని మంత్రి అన్నారు. అలాగే రాజీవ్ చంద్రశేఖర్ ఈ పరిస్థితిని రెండు సంవత్సరాల పాటు కోలుకోలేని విధంగా కోల్పోయిన కంపెనీతో పోల్చాడు. 

 

"ఈ ఏడాది జూలైలో గత 18 సంవత్సరాలలో అత్యంత బలమైన పన్ను వసూళ్లను చూసింది. మన అందరికీ తెలిసిన, అంగీకరించిన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలలో మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం, డైవర్సిఫైడ్ అండ్ రెసిలియెంట్ చేసింది" అని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios