ఫిట్‌నెస్, క్రీడలను పిల్లలకు చిన్నతనం నుండి టీనేజ్ వయసు వరకు అందుబాటులోకి తీసుకురావలనే ఆలోచనను పెంపొందిస్తు మాజీ అంతర్జాతీయ డికాథ్లెట్, ఫిట్‌నెస్ ఔత్సాహికులు, కొంతమంది వ్యక్తులు అప్‌యుగో అనే ప్లాట్ ఫార్మ్ ను రూపొందించారు. 


జూన్ 2019లో బెంగళూరులో ప్రారంభమైన అప్‌యుగో  అన్ని వయసుల పిల్లలకు ఫిట్‌నెస్, క్రీడలలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది."ఈ రోజుల్లో పిల్లలు తగినంత శారీరక శ్రమ చేయడం లేదు. పోనీ క్రీడా కేంద్రాలకయినా వెళదామంటే... కుదరని పని. అయితే ఖర్చు తో కూడుకొవడమో, లేదా దూరంగా వెళ్లలేని పరిస్థితి. 


అర్హతగల, శిక్షణ పొందిన నిపుణుల కొరత, వయసుకు తగ్గ కార్యక్రమాలు లేకపోవడం వల్ల పిల్లలు శారీరక ఫిట్నెస్ కు దూరమవుతున్నారు. టెక్నాలజీ ద్వారా ఒక మోడల్‌ను సృష్టించి మన భావితరాలపై ఒక అర్థవంతమైన ముద్రను వేయాలని భావించాము. 

ఆధునిక జీవనశైలితో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, భారతదేశంలో క్రీడలు, ఫిట్నెస్ ఎకో సిస్టమ్ అంతగా అందుబాటులో లేకపోవడం వల్ల ఇంతకుముందు కంటే ఇప్పుడు ఈ ఫిట్నెస్ పై దృష్టికేంద్రీకరించడం, ఫిట్నెస్ ను అందరికి అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరం. పిల్లలకు పెద్దలకు ఒకే రకమైన ఫిట్నెస్ మోడల్ ని కాకుండా, ఎవరికీ తగ్గ రీతిలో వారికి మాడ్యూల్స్ అవసరమని" అప్ యుగో వ్యవస్థాపకుడు అమిత్ గుప్తా చెప్పారు. 


అప్‌యుగో  పిల్లల కోసం స్పోర్ట్స్, ఫిట్‌నెస్ మాడ్యూల్స్ వయస్సుకి తగిన ప్రోగ్రామ్‌లను డిజైన్ చేసింది. ఇవి శాస్త్రీయంగా రూపొందించబడ్డాయి, అంతర్జాతీయ పాఠ్యాంశాలపై ఆధారపడి ఉంటాయి. ఫిట్‌నెస్, స్పోర్ట్స్, న్యూట్రిషన్, యోగా, మైండ్ కోచింగ్ రంగాలకు చెందిన సబ్జెక్ట్ నిపుణులు ఈ కార్యక్రమాలను అందిస్తారు. 

ఇది ఫిజికల్, డిజిటల్, హైబ్రిడ్ మోడల్ లలో ఉంటుంది. తద్వారా దేశంలోని ఏ ప్రాంతంలోని వారికైనా అందుబాటులో ఉంటుంది. పిల్లల కోసం రూపొందించబడిన ఇతర ఫిట్నెస్ మాడ్యూల్స్ కన్నా ఇది భిన్నమైనది. 

also read ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం వాడుతున్నారా అయితే జాగ్రత్త.. క్యాష్ విత్‌డ్రా చేసేటప్పుడు.. ...

మొదట బి2సి ఫార్మాట్‌తో ప్రారంభించిన సంస్థ, ఆ తరువాత బి2 బి మోడల్ లో కి మారి నేరుగా పాఠశాలలకు (ప్రైవేట్ & ప్రభుత్వ) సేవలను అందిస్తోంది. "లాక్ డౌన్ వల్ల ఇతర ఫిట్నెస్ సొల్యూషన్ సంస్థలెలా అయితే ఒకింత నష్టాన్ని చవిచూశాయో... తాము కూడా అదే విధంగా చవి చూశామని, కాకపోతే డిజిటల్ ప్లాట్ ఫారం మీద సేవలందించే విధంగా టెక్నాలజీని విరివిగా వాడామని, హైదరాబాద్, ఇండోర్, కాన్పూర్, ఢీల్లీ-ఎన్‌సిఆర్, పూణే నుండి కస్టమర్లు, కార్పొరేట్లు మా ప్లాట్‌ఫామ్‌లో సేవలను పొందుతున్నారని మేము గౌరవంగా భావిస్తూన్నము" అని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ వినోద్ కుమార్ చెప్పారు. 


ఫిట్నెస్ ప్రేమికులకు, క్రీడాభిమానులకు మరింత చేరువకావడానికి, మంచి కస్టమర్ అనుభవాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో అప్‌యుగో ఇటీవల మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో అందుబాటులో తెచ్చింది. క్రీడా శిక్షణ కోసం అప్‌యుగో అనేక రకాల కొత్త కార్యక్రమాలను జోడించింది.తొలుత క్రికెట్, ఫుట్ బాల్ కోచింగ్ ను ప్రారంభించినట్టుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ క్రీడలకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన క్రీడాకారులు కోచింగ్ ఇస్తారని కంపను ప్రతినిధులు తెలిపారు. 

భవిష్యత్తులో క్రీడలను పిల్లలకు మరింతదగ్గరచేయడం కోసం, టెక్నాలజీని విరివిగా వాడి పిల్లలకు అందుబాటులోకి ఫిట్నెస్ ను తీసుకురావాలనే ఉద్దేశంతో, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని సృష్టించడంకోసం అప్‌యుగో అధునాతన టెక్నాలజీతోడుగా ముందుకు వెళుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. 


  అప్‌యుగో లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పిల్లాడి తల్లి మాట్లాడుతూ... "అతను అప్‌యుగో క్లాస్ లో చేరిన 15 రోజుల్లో అతని శక్తి, దృడత్వంలో కనిపించే మార్పును నేను చూడగలిగాను. రోజంతా ఉత్సాహంగా ఉంటున్నాడు” అని లాక్ డౌన్ సమయంలో ఫిట్నెస్ తరగతుల కోసం అప్‌యుగోలో చేరిన ఒకరి పేరెంట్స్ చెప్పారు. 


"నా పిల్లల ఓర్పు, శక్తిలో నేను చాలా మార్పును చూస్తున్నాను. ప్రోగ్రామ్ విధానాన్ని నేను అభినందిస్తున్నాను. కోచ్‌లు వారి సెషన్లను ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా మార్చారు" అని బెంగళూరుకు ఇద్దరు యువ ఛాంపియన్ల పేరెంట్స్ చెప్పారు.