Min read

UPI : నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే సేవలు ... ఎందుకో తెలుసా? 

UPI Payment Outage: Impact, User Reactions, and Solutions in telugu akp

Synopsis

దేశవ్యా UPI సేవలు ఆగిపోయాయి, చాలా మంది పేమెంట్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు.   

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది.  దీంతో దేశవ్యాప్తంగా యూపిఐ ఆధారంగా పనిచేసే మనీ ట్రాన్సాషన్స్ యాప్స్ పనిచేయక చాలామంది ఇబ్బందిపడ్డారు. ఈ యూపిఐ సర్వీస్ అంతరాయంపై ఇవాళ(బుధవారం) సాయంత్రానికి 2,750 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది.  

చాలా మంది యూజర్లు అంటే దాదాపు 83% మంది పేమెంట్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. 13% మంది డబ్బులు పంపడానికి ఇబ్బంది పడ్డారు. 4% మంది యాప్ లోనే సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. సర్వస్ డౌన్ కావడంవల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది... దీన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

యూపిఐ, ఆన్ లైన్ ట్రాన్సాషన్స్ కు అలవాటుపడి చాలామంది ఇప్పటికే డబ్బులు వెంటపెట్టుకోవడం మరిచిపోయారు. ఇలాంటి వారు పోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్స్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

యూపిఐ సేవల అంతరాయంపై సోషల్ మీడియాలో సరదా కామెంట్స్

యూపిఐ సేవలకు అంతరాయంపై పలువురు సోషల్ మీడియా వేదికన సీరియస్ అవుతున్నారు. ఇక మరికొందరు ఈ పరిస్థితి సరదాగా తీసుకుని సోషల్ మీడియాలో కామెంట్స్, మీమ్స్ చేస్తున్నారు.  

'అందుకే పెద్దలు చెప్పాడు డబ్బులు తీసుకెళ్ళమని... ఆన్ లైన్ పేమెంట్స్ రాకతో ఇప్పటికే చాలామంది డబ్బులు దగ్గర పెట్టుకోవడం మరిచారు. ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితిని ఎదుర్కొంటున్నారు'' అని ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్ట్ చేసాడు.

 

ఇక మరో నెటిజన్ కాస్త సరదాగా స్పందించాడు. ''గత గంట సేపటినుండి యూపిఐ ద్వారా పేమెంట్ చేద్దామంటే కావడంలేదు. ఈరోజు నాకు అంట్లు తోమడం తప్పేలా లేదు'' అంటే ఎక్స్ లో ట్వీట్ చేసాడు. 
 
 

Latest Videos