అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకు(ఎస్వీబీ) పతనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రభావం టెక్ ప్రపంచంపై ఏ స్థాయిలో ఉంటుందనే ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ఎస్వీబీ పతనంతో ప్రభావితమైన భారత్‌లోని స్టార్టప్‌లతో భేటీ కానున్నట్టుగా తెలిపారు.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకు(ఎస్వీబీ) పతనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రభావం టెక్ ప్రపంచంపై ఏ స్థాయిలో ఉంటుందనే ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. ఎస్వీబీ పతనంతో ప్రభావితమైన భారత్‌లోని స్టార్టప్‌లతో భేటీ కానున్నట్టుగా తెలిపారు. సిలికాన్ వ్యాలీ బ్యాంకు మూసివేత ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లకు అంతరాయం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లు న్యూ ఇండియా ఎకానమీలో ఒక ముఖ్యమైన భాగమని గుర్తుచేశారు. ఈ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి తాను ఈ వారం భారతీయ స్టార్టప్‌లను కలవనున్నట్టుగా పేర్కొన్నారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుందనేది చర్చించనట్టుగా తెలిపారు.
అదే సమయంలో యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం.. భారతదేశం స్థిరమైన, బలమైన ఆర్థిక రంగానికి పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. దానిని.. గత దశాబ్దంలో కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైన క్రోనీ ఎన్‌పీఏ నుంచి.. నేడు న్యూ ఇండియా ఎకానమీకి బలమైన, అభివృద్ధి ఉత్ప్రేరకంగా పునర్నిర్మించారని పేర్కొన్నారు.
ఇక, 1983లో ప్రారంభమైన సిలికాన్ వ్యాలీ బ్యాంకు.. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌గా ఉంది. ఆర్థిక సంక్షోభంతో ఈ బ్యాంక్ కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజున బ్యాంకును మూసివేశారు. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) ఈ విషయాన్ని ప్రకటించింది. బ్యాంక్‌ను మూసివేయనున్నట్లు వార్తలు రావడంతో భారీ సంఖ్యలో ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు తమ సొమ్మును తీసుకునే ప్రయత్నం చేశారు. గురువారం రోజున దాదాపు 42 బిలియన్ల డాలర్ల డబ్బును డిపాజిటర్లు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద టెక్ కంపెనీలకు అతిపెద్ద రుణదాతగా ఉంది. ఇందులో పలు భారతీయుల స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. దీంతో ఎస్వీబీ పతనం.. భారతీయుల స్టార్ట్‌పలపై, ముఖ్యంగా అమెరికన్ క్లయింట్స్ సేవలందిస్తోన్న SaaS (సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్) సెక్టార్‌లో సేవలందిస్తున్న స్టార్ట్‌ప్‌లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
