రాబోయే బడ్జెట్ 2021-22 కోసం నేడు న్యూ ఢీల్లీలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్ర మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో  ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ముందస్తు బడ్జెట్ సమావేశం నిర్వహించారు.

ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్ డిసెంబర్ 14 నుండి మంత్రులతో ముందస్తు బడ్జెట్ చర్చలను ప్రారంభించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సమావేశాలు ఈ సంవత్సరం వర్చువల్‌గా జరుగుతున్నాయి.

21 డిసెంబర్ 2020న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాబోయే కేంద్ర బడ్జెట్ 2021-22 కు సంబంధించి మౌలిక సదుపాయాలు, ఇంధనం, వాతావరణ మార్పులపై ప్రముఖ నిపుణులతో 11వ ముందస్తు బడ్జెట్ సంప్రదింపులు జరిపారు. 

also read శాంసంగ్ వైస్ చైర్మ‌న్ కు జైలుశిక్ష… భారీ అవినీతి కేసులో కోర్టు తీర్పు.. ...

ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపడతారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందు మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో బడ్జెట్ కోసం సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది.

ఇటువంటి పరిస్థితిలో బడ్జెట్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రభుత్వం 2021 బడ్జెట్ కోసం సాధారణ ప్రజల నుండి సలహాలను కోరింది. దీనితో పాటు బడ్జెట్ 2021-22 చర్చలలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం మైగోవ్ ప్లాట్‌ఫామ్‌ను సులభతరం చేసింది.

మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాన్ని, ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించడం కోసం 2021-22 బడ్జెట్‌పై దృష్టి పెడతామని ఆర్థిక మంత్రి అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పెట్టుబడులు కూడా ప్రభావితమైందని అన్నారు.