Asianet News TeluguAsianet News Telugu

సముద్రంలో బుల్లెట్ ట్రైన్.. ఎక్కడ, ఎలా నిర్మిస్తారో తెలుసా..?

ఇండియాలో తొలిసారిగా నిర్మించనున్న ఈ టన్నెల్ భూమి మట్టానికి దాదాపు 25 నుంచి 65 మీటర్ల కింద నిర్మించనున్నారు. దీని లోతైన నిర్మాణ ప్రదేశం ముంబైలోని శిల్పాటా సమీపంలోని పార్సిక్ కొండ క్రింద 114 మీటర్లు ఉంటుంది. 

Under Sea Tunnel:  know how and where will it be constructed?
Author
First Published Sep 26, 2022, 12:03 PM IST

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీని కింద రాబోయే కొన్నేళ్లలో బుల్లెట్ రైళ్లను నడపడానికి మొదటి అండర్ సీ టన్నెల్ నిర్మించనున్నారు. సముద్రం అడుగున నిర్మించనున్న ఈ సొరంగంలో రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ టన్నెల్ పొడవు 21 కి.మీ ఉంటుంది, ఇందులో ఏడు కి.మీ సముద్రం నుండి గంజ్రాన్ వరకు  ఉంటుంది. నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ (NHSRCL) దీని నిర్మాణానికి బిడ్లను ఆహ్వానించింది. గతేడాది నవంబర్‌లో అండర్ సీ టన్నెల్ నిర్మాణానికి కార్పొరేషన్‌ టెండర్లు దాఖలు చేయగా, అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో దానిని రద్దు చేశారు. 

బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ అండ్ శిల్పాటా  స్టేషన్లను అనుసంధానించేలా నిర్మాణం 
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ అండ్ శిల్పాటా భూగర్భ స్టేషన్‌లను కలుపుతూ ఈ సొరంగం నిర్మించబడుతుంది. ఈ సొరంగం నిర్మాణానికి రూపొందించిన టెండర్ డాక్యుమెంట్ ప్రకారం, ఈ సొరంగం టన్నెల్ బోరింగ్ మిషన్లు అండ్ న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతిని ఉపయోగించి నిర్మించబడుతుంది.

బ్రహ్మపుత్ర నదిలో 
ఢిల్లీ-ముంబై ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ కోసం యమునా నదిలో నీటి అడుగున సొరంగం నిర్మించడానికి ముందుగా ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. కానీ ఇది సాధ్యం కాలేదు. దీనితో పాటు రోడ్స్ అండ్ రైల్వే మంత్రిత్వ శాఖ కూడా బ్రహ్మపుత్ర నదిలో సొరంగం నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది వాహనాలు ఇంకా రైళ్ల నిర్వహణకు ఉపయోగించవచ్చు. 

సముద్రంలో ఏర్పడిన టన్నెల్ ప్రత్యేకత ఏమిటి? 
NHSRCL ప్రకారం, థానే బేలోని సొరంగం సింగిల్ ట్యూబ్ టెక్నాలజి పై     ఆధారపడి ఉంటుంది. ఈ ట్యూబ్ ఇన్‌కమింగ్ అండ్ అవుట్‌గోయింగ్ ట్రాక్‌లను కలిగి ఉంటుంది. NHSRCL ప్రకారం, సొరంగం సైట్‌కు ఆనుకుని ఉన్న 37 ప్రదేశాలలో ఈ ప్రాజెక్ట్‌ 39 ఎక్విప్మెంట్ రూమ్స్ కూడా నిర్మించబడతాయి. 

ముంబైలోని కొండకు 114 మీటర్ల కింద నిర్మాణం 
ఇండియాలో తొలిసారిగా నిర్మించనున్న ఈ టన్నెల్ భూమి మట్టానికి దాదాపు 25 నుంచి 65 మీటర్ల కింద నిర్మించనున్నారు. దీని లోతైన నిర్మాణ ప్రదేశం ముంబైలోని శిల్పాటా సమీపంలోని పార్సిక్ కొండ క్రింద 114 మీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 13.1 మీటర్ల  కట్టర్ హెడ్‌తో టన్నెల్ బోరింగ్ మెషిన్స్ ఉపయోగించబడతాయి. 

2026 నాటికి దేశంలో బుల్లెట్ రైలు నడపడమే లక్ష్యం
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కింద నీటి అడుగున టన్నెల్ నిర్మించడం దేశంలోనే ఇదే మొదటి ప్రాజెక్ట్. దీని నిర్మాణానికి బిడ్‌ల చివరి తేదీ 29 జనవరి 2023గా నిర్ణయించారు. 2026లో గుజరాత్‌లో 50 కి.మీ మార్గంలో బుల్లెట్ రైలు మొదటి ట్రయల్ రన్ ప్రారంభం అవుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios