హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు, బిగ్ బస్ సీజన్ 3 విన్నర్ రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీకాంత్‌ కొండపిలు భాగస్వామ్యులుగా ఏర్పాటు చేసిన ‘ఊకో కాక’ స్టోర్‌ను పలువురు సినీ నటులతో పాటు బిగ్‌బాస్‌ సీజన్ 4 పోటీదారులు ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్టోర్‌లో బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో పాల్గొన్న సోహెల్, నోయల్‌, మహబూబ్‌తో పాటు శివజ్యోతి, అశురెడ్డి, హిమజ, రోషిణి తదితరులు పాల్గొని సందడి చేశారు.  

‘ఊకో కాక’ స్టోర్‌ ప్రారంభోత్సవ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌ మాట్లాడుతూ ఇది మా రెండో స్టోర్ ప్రారంభం అని, ఉగాది నాటికి తెలుగు రాష్ట్రాల్లో మరో 25 స్టోర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్టోర్‌లో ఏర్పాటు చేసే వస్త్రాలు వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికుల, డిజైనర్లతో రూపొందించినట్లు తెలిపారు.