విశాఖలో ఇండియన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కేంద్రాన్ని ఏర్పాటుచేసిన ఉబెర్
రైడ్-హెయిలింగ్ యాప్ ఉబెర్ తన సెకండ్ ఇండియన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ను విశాఖపట్నంలో ప్రారంభించింది. ఇది భవిష్యత్తులో మొత్తంగా 500 మందికి ఉద్యోగాలను కల్పిస్తుందని భావిస్తున్నారు.
భారతదేశం, దక్షిణ ఆసియా మరియు APAC ప్రాంతాలలో ఈ కొత్త కేంద్రం ఉబెర్ కస్టమర్లకు సపోర్ట్ ఇవ్వడానికి అంకితభావంతో పనిచేసే వ్యక్తులను నియమించనుంది.రైడ్-హెయిలింగ్ యాప్ ఉబెర్ తన సెకండ్ ఇండియన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ను విశాఖపట్నంలో ప్రారంభించింది. ఇది భవిష్యత్తులో మొత్తంగా 500 మందికి ఉద్యోగాలను కల్పిస్తుందని భావిస్తున్నారు.
also read సుందర్ పిచాయ్‌కు ప్రమోషన్.. ఆల్ఫాబెట్ బాధ్యతలు ఇక సుందర్‌కే
దీనికోసం $800,000 వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం కస్టమర్లకు అత్యవసర సమయంలో అవసరమయ్యే కస్టమర్ సపోర్ట్ ను అందిస్తుంది.ఇది 24X7 మోడల్‌లో పనిచేస్తుంది ఈ కొత్త కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఇది ఉబెర్ 12వ సెంటర్ భారతదేశంలో ఇది రెండవది.
భారతదేశం, దక్షిణ ఆసియా మరియు APAC ప్రాంతాలలో మిలియన్ల మంది ఉబెర్ కస్టమర్లకు సపోర్ట్ ఇవ్వడానికి అంకితభావంతో పనిచేసే వ్యక్తులను నియమించనుంది.ఉబెర్ సంస్థకు నివేదించబడిన ఏదైనా అత్యవసర సమస్య లేదా సంఘటనపై శిక్షణ పొందిన COE బృందాలు స్పందిస్తాయి.
also read అప్పుడు ఫ్రీ అన్నారు.. ఇప్పుడు మెగిస్తున్నారు
"భారతదేశంలో రెండవ COE ప్రారంభించడంతో, మా ఉబెర్ ప్రయాణికులకు సురక్షితమైన బాధ్యతాయుతమైన పరిష్కారాలను తీసుకురావడం ద్వారా భారతదేశం పట్ల మాకు ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. కొత్త COE ద్వారా మేము మా గ్లోబల్ కస్టమర్ సపోర్ట్ ఫుట్‌ప్రింట్‌ను విస్తరించాలని, అలాగే ఈ దేశంలో అధిక సామర్థ్యం ఉన్న ప్రతిభావంతులకు కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ”అని సంస్థ సీనియర్ డైరెక్టర్ వెన్ స్జూ లిన్ తెలిపారు.