Asianet News TeluguAsianet News Telugu

Twitter-Musk Deal: ట్విట్టర్ కు సవాల్ విసిరిన మస్క్...అలా చేస్తే ట్విట్టర్ ను మళ్లీ కొంటా అంటూ ఆఫర్

ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య పోరు ముదురుతోంది. ఈ నేపథ్యంలో బిలియనీర్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను బహిరంగ చర్చకు ఆహ్వానించారు. స్పామ్ బాట్‌లు , నకిలీ ఖాతాల గురించి ట్విట్టర్ తప్పుగా లెక్కించిందని మస్క్ ఆరోపించారు. ట్విట్టర్‌లో వచ్చిన ఓ ప్రశ్నకు మస్క్ సమాధానమిచ్చారు.

Twitter-Musk Deal Musk challenged Twitter offered to buy Twitter again
Author
Hyderabad, First Published Aug 8, 2022, 3:06 PM IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మస్క్ ట్విట్టర్ సీఈఓకు కొత్త సవాల్ విసిరాడు. అంతే కాదు మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనే కోరికను మరోసారి వ్యక్తం చేశాడు, అయితే అతను దీనికి ఒక షరతు పెట్టాడు. మస్క్ 100 ట్విట్టర్ అకౌంట్ల శాంపిల్ ఇస్తానని అందులో ఎన్ని ఫేక్ ఉన్నాయో, ఎన్నీ రియల్ ఉన్నాయో తేల్చి ఇవ్వాలని తెలిపారు. అప్పుడు తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని, తీసుకుంటానని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు ట్విట్టర్‌లో బహిరంగ సవాలు విసిరారు.

ఎలాన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసే ఒప్పందం నుండి కూడా వైదొలిగాడు. నకిలీ ఖాతాల గురించి కచ్చితమైన సమాచారం అందించడంలో ట్విటర్ విఫలమైందని పేర్కొంటూ మస్క్ 44 బిలియన్ల ట్విట్టర్ డీల్‌ను రద్దు చేసుకున్నాడు. దీన్ని అనుసరించి, ట్విట్టర్ బోర్డు ఎలాన్ మస్క్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యింది. దీనిపై మస్క్ న్యాయ పోరాటం కూడా ప్రారంభించాడు. ట్విట్టర్‌పై కౌంటర్‌ దావా వేశారు. 

స్పామ్ , నకిలీ ఖాతాల గురించి మరింత సమాచారం కోసం మస్క్ అడిగినప్పుడు ట్విట్టర్ అస్పష్టమైన డేటాను అందించిందని డేటా విశ్లేషకుడు ఆండ్రియా స్ట్రోపా ట్వీట్ చేశారు. ట్విటర్ కాలం చెల్లిన డేటాను అందించిందని  పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు. జరిగిన విషయాలను మంచి మార్గంలో విశ్లేషించారని , అందుకు అతడిని అభినందిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నాడు. అంతే కాదు డేటాపై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను బహిరంగ చర్చకు రమ్మని సవాలు చేస్తున్నానని మస్క్ పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే ట్విట్టర్ తన రోజువారీ క్రియాశీల వినియోగదారులలో 5 శాతం మాత్రమే స్పామ్ ప్రొఫైల్స్ అని పేర్కొంది. అయితే ఇది దాదాపు 237.8 మిలియన్లు అని మస్క్ పేర్కొన్నాడు. ట్విట్టర్ గతంలో రోజుకు 1 మిలియన్ స్పామ్ ఖాతాలను బ్లాక్ చేస్తుందని పేర్కొంది. 

స్పామ్ , నకిలీ ఖాతాల గురించి సమాచారాన్ని అందించడానికి ట్విట్టర్ నిరాకరిస్తే తాను ఒప్పందం నుండి తప్పుకుంటానని మస్క్ చెప్పారు. ట్విట్టర్‌ను మరింత పారదర్శకంగా మార్చడం, ట్వీట్‌లలో పదాల నిడివి పెంచడం, అల్గారిథమ్‌ను మార్చడం , మరింత భావవ్యక్తీకరణ , భావప్రకటన స్వేచ్ఛను అనుమతించడం: ట్విట్టర్‌ని మరింత పారదర్శకంగా మార్చడం వంటి లక్ష్యాలను సాధించాలనుకుంటున్నట్లు మస్క్ చెప్పారు. 

ఎలాన్ మస్క్ గత ఏప్రిల్‌లో ట్విట్టర్‌ని కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. సుదీర్ఘ చర్చల తర్వాత ట్విట్టర్‌ని కొనుగోలు చేసేందుకు మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 4,400 కోట్ల డాలర్లకు ఒప్పందం కుదిరింది. మస్క్ ట్విటర్‌ను టేకోవర్ చేయకుండా ఆపడానికి చివరి ప్రయత్నంగా, ట్విట్టర్ మస్క్‌పై విష మాత్రను ప్రయోగించింది, కానీ తప్పించుకునే అవకాశం లేదు. మస్క్  44 బిలియన్ల ఆఫర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ట్విట్టర్ వాటాదారుల నుండి చాలా ఒత్తిడిని ఎదుర్కొంది. అప్పుడు ఎలాన్ మస్క్ , కంపెనీ ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందానికి వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios