Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ యుద్ధం ఆగేలా లేదు: ఈయూ దేశాలకూ షాకిచ్చారు

ఏడాది క్రితం చైనా, భారత్ సహా పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన త్రుష్ణ తీరలేదన్నారు. తాజాగా ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే చీజ్, హెలికాప్టర్లపై సుంకాలు విధించారు.

Trump has a message for the world: My trade wars aren't over yet
Author
Washington, First Published Apr 11, 2019, 2:29 PM IST

వాషింగ్టన్: తన వాణిజ్య యుద్ధాలు ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టమైన సందేశం పంపారు. వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్‌, వరల్డ్‌బ్యాంక్‌ స్ప్రింగ్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏర్పాటైన ఆర్థిక విధాన కర్తల సమావేశంలో ఆయన ఈ సంగతి తెలిపారు.

‘నా వాణిజ్య యుద్ధాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. బలహీన పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవప్థను ఎదుర్కొని తీరాల్సిందే’ అని ట్రంప్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి దిగుమతి అయ్యే 11 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, చీజ్‌ వంటి వాటిపై పన్నులు విధించారు. 

ఒక పక్క చైనాతో ఒప్పందం చేసుకొనేందుకు చర్చలు జరుపుతూనే మరోపక్క వివిధ దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాలను పునర్‌ లిఖించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ట్రంప్‌ చర్యలపై ఆర్థిక వేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ వృద్ధిరేటు తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వచ్చే దిగుమతులపై విధించిన టారీఫ్‌లు బోయింగ్‌కు లాభించనున్నాయి. కొత్త టారీఫ్‌లు ఎయిర్‌బస్‌ వ్యాపారంపై ప్రభావితం చూపనున్నాయి. ఇది బోయింగ్‌కు కలిసి వస్తుంది. 

దీంతో ఎయిర్‌ బస్‌ డబ్ల్యూటీవో తలుపు తట్టనుంది. దీంతో డబ్ల్యూటీవో తీర్పు కోసం అమెరికా ఎదురు చూస్తోంది. యూరప్‌ తీరుపై ట్రంప్‌ ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. ‘అమెరికా వాణిజ్య విధానాలను ఈయూ బాగా వాడుకొంది. త్వరలోనే దానికి ముగింపు పడుతుంది.’’ అని ట్రంప్‌ మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios