ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో చాలా పట్టణాల్లో విస్తరించి ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ మ‌క‌ర‌సంక్రాంతి సంద‌ర్భంగా చిన్న ప‌ట్ట‌ణాల్లోని వినియోగ‌దారుల‌కు ఆస‌క్తిక‌ర‌మైన పోటీ నిర్వహిస్తుంది. 

హైద‌రాబాద్ 12 జ‌న‌వ‌రి 2022: దేశంలోనే అతిపెద్ద‌, వేగంగా విస్త‌రిస్తున్న దుస్తులు, ఇతర ఉపకరణాల రీటైల్ చైన్ రిల‌య‌న్స్ ట్రెండ్స్ సంక్రాంతి సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లోని చిన్న ప‌ట్ట‌ణాల్లోని వినియోగ‌దారుల‌కు ఆస‌క్తిక‌ర‌మైన పోటీలు పెడుతూ వారితో బంధాన్ని మరింత బ‌లోపేతం చేసుకుంటోంది.

మ‌క‌ర సంక్రాంతి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ముఖ్య‌మైన పండుగ‌. సంక్రాంతి అంటే మార్పు. ఆ రోజు సూర్యుడు మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశిస్తాడ‌ని చెబుతారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఉత్త‌ర‌దిశ‌గా క‌దిలే ఈ సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు. సూర్యుడు మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశించే తొలిరోజే మ‌క‌ర సంక్రాంతి.

మ‌క‌ర సంక్రాంతిని రంగురంగుల అలంక‌ర‌ణ‌లతో సంబ‌రంగా చేసుకుంటారు. గ్రామాల్లో పిల్ల‌లు ఇంటింటికీ తిరిగి పాట‌లు పాడుతూ మిఠాయిలు స్వీకరిస్తారు. ఇక భోగి మంట‌లు, ప్రత్యేకమైన విందు వంట‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో చాలా ప్రాధాన్య‌మైన‌వి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో చాలా పట్టణాల్లో విస్తరించి ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ మ‌క‌ర‌సంక్రాంతి సంద‌ర్భంగా చిన్న ప‌ట్ట‌ణాల్లోని వినియోగ‌దారుల‌కు ఆస‌క్తిక‌ర‌మైన పోటీ నిర్వహిస్తుంది.

“ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోలి” పోటీ: 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఉన్న ట్రెండ్స్ మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్భంగా వినియోగదారుల‌తో ఉన్న బంధాన్నిమరింత పెంచుకుంటోంది. ఇందుకు “ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోలి” అనే ఒక ఆస‌క్తిక‌ర‌మైన పోటీ తీసుకొచ్చింది. ఏంటంటే వినియోగ‌దారులు వారి ఇంటి ముందు లేదా ప్రాంగణంలో వేసిన రంగురంగు ముగ్గుల‌తో ఓ సెల్ఫీ తీసుకోవాలి. దాన్ని ట్రెండ్స్ ఈ పోటీ కోసం ప్ర‌త్యేకంగా పెట్టిన వాట్సాప్ నంబ‌రుకు పంపాలి.

బెస్ట్ ముగ్గుగా ఎంపికైన సెల్ఫీ/ఫొటోకు మొద‌టి బ‌హుమ‌తిగా సుమారు రూ. 1500/- ఇస్తారు. అంతేకాదు, పోటీలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ ట్రెండ్స్ డిస్కౌంట్ కూప‌న్ ల‌భిస్తుంది. దీన్ని వారి స‌మీపంలోని ట్రెండ్స్ స్టోర్ నుంచి పొంద‌చ్చు. ఈ పోటీ 2022 జ‌న‌వ‌రి 20న ముగుస్తుంది.

పోటీకి సంబంధించిన వివ‌రాల‌ను వినియోగ‌దారుల‌కు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయ‌డంతో పాటు ఇంటింటికీ వ‌చ్చే ట్రెండ్స్ పాంప్లెట్ల ద్వారా కూడా తెలుపుతారు. ట్రెండ్స్ స్టోర్లకు స‌మీపంలో ఉండే ప్ర‌ముఖులు విజేత‌ల‌ను ఎంపిక చేస్తారు.

 ఎంట్రీలు అందిన త‌ర్వాత వినియోగ‌దారులంద‌రికీ ట్రెండ్స్ వాట్సాప్ నుంచి థాంక్యూ అనే మెసేజ్ పంపుతుంది. విజేత‌లు ఎవ‌ర‌న్న విష‌యాన్నీ అంద‌రికీ వాట్సాప్ ద్వారా తెలియ‌జేస్తారు.

మొద‌టి బ‌హుమ‌తి విజేత‌ను ఆయా న‌గ‌రాలు/ప‌ట్ట‌ణాల్లోని ట్రెండ్స్ స్టోర్ కి ఆహ్వానిస్తారు. మొద‌టి బ‌హుమ‌తి సుమారు రూ.1500/- ను ఆయా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని మునిసిపాలిటీ లేదా పోలీసు శాఖ‌ల‌లో ఉన్న సీనియ‌ర్ మ‌హిళా ప్ర‌భుత్వాధికారుల చేతుల మీదుగా బ‌హూక‌రిస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు మీకు స‌మీపంలోని ట్రెండ్స్ స్టోర్ల‌ను సంద‌ర్శించండి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో వినియోగ‌దారుల‌తో ట్రెండ్స్ అనుబంధం మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్భంగా మ‌రోసారి రుజువైంది. వినియోగ‌దారుల రోజు జీవితాల్లో భాగమైన ముఖ్య‌మైన పండుగ‌లు, సామాజిక సంద‌ర్భాల‌లో వారితో అనుబంధం ఏర్ప‌రుచుకుంటోంది.

మ‌క‌ర సంక్రాంతి స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రాష్ట్రాల్లో వినియోగ‌దారుల కోసం ట్రెండ్స్ స‌రికొత్త వ‌స్త్రశ్రేణిని తీసుకొచ్చింది. పురుషులు, మ‌హిళ‌లు, పిల్ల‌ల కోసం తాజా డిజైన్ల‌లో వ‌స్త్రాల‌తో పాటు పాద‌ర‌క్ష‌లు, ఇత‌ర యాక్సెస‌రీలు అన్నీ అందుబాటులోకి తెచ్చింది.

అత్యాధునిక ఫ్యాష‌న్ల‌తో, అందుబాటు ధ‌ర‌ల్లో ఉండే ఈ రేంజితో ట్రెండ్స్ త‌న వినియోగ‌దారుల‌కు ప్ర‌తిరోజూ తిరుగులేని వ‌స్త్ర ప్ర‌పంచాన్ని అందిస్తోంది. దీంతో వారు రోజూ ఫ్యాష‌న‌బుల్‌గా క‌నిపిస్తారు.