TRAI New Rules: మే 1 నుంచి ఫేక్ కాల్స్, SMSల నుంచి విముక్తి..ట్రాయ్ నూతన నిబంధనలతో అడ్వర్టయిజ్ మెంట్లకు చెక్

మీరు మంచి బిజీ సమయంలో ఉన్నప్పుడు లోన్ కావాలా,  ఫ్లాట్ కొంటారా,  మరి ఇతర ప్రాజెక్టు కొంటారా అంటూ  అడ్వర్టైజ్మెంట్ కాల్స్  వస్తున్నాయా,  అయితే మే ఒకటి నుంచి ఈ బెడద నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆ నిబంధనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 

TRAI New Rules Freedom from fake calls and SMS from May 1.. Check advertisements with TRAI's new rules MKA

పొద్దున లేచినప్పటి నుంచి సమయం, సందర్భం లేకుండా ఫేక్ కాల్స్, ప్రమోషన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు మిమ్మల్ని విసిగిస్తున్నాయా అయితే మే ఒకటో తేదీ నుంచి మీకు ఈ బెడద ఉండదు ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్  సరికొత్త రూమ్స్ ను  అమలులోకి తెస్తుంది.  ఈ రూల్స్ అమల్లోకి వస్తే  భారీ మార్పులు జరగనున్నాయి ఫలితంగా మీరు ఇకపై మీ ఫోన్ కు వచ్చే ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్ ల  బెడద నుంచి విముక్తి పొందే వీలుంది. 

మే 1, 2023 నుండి, TRAI కొత్త నిబంధనల ప్రకారం ఒక ఫిల్టర్‌ను సెటప్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా, ఫోన్‌లో నకిలీ కాల్స్,  SMSలను నిరోధించే వీలుంది.  తద్వారా మనకు తెలియని కాల్స్,  SMS నుండి బయటపడవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు ఇకపై తమ ఫోన్ కాల్స్, మెసేజ్ సర్వీస్‌లకు అధికారిక ఇంటెలిజెన్స్ స్పామ్ ఫిల్టర్‌లను జోడించాలని TRAI ఆదేశించింది. దీని ద్వారా ఫేక్ కాల్స్, మెసేజ్‌లు వినియోగదారులకు చేరకుండా నిరోధించవచ్చు. ట్రాయ్ ఆర్డర్ ప్రకారం, అన్ని టెలికాం కంపెనీలు 1 మే 2023లోపు ఫోన్ కాల్స్, మెసేజ్ ల కు  సంబంధించిన ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ఎయిర్‌టెల్ ఇప్పటికే అలాంటి AI ఫిల్టర్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. అయితే, జియో నకిలీ కాల్స్, మెసేజీల కోసం AI ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి, ఈ సమాచారం మాత్రమే ఇప్పటివరకు వెల్లడి చేయబడింది, అయితే మే 1, 2023 నుండి భారతదేశంలో AI ఫిల్టర్‌ల అప్లికేషన్ ప్రారంభం కానుంది. 

ట్రాయ్ కొత్త రూల్ ఫేక్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టడంలో సహాయపడుతుంది. అంతేకాదు 10 అంకెల ఫోన్ నంబర్స్ ఇకపై ప్రమోషన్స్, మార్కెటింగ్ చేసేందుకు వినియోగించకూడదని నిశేధం విధించింది. 

అంతేకాదు TRAI త్వరలోనే  కాలర్ ID ఫీచర్‌ను కూడా తీసుకువస్తోంది. దీంతో మీకు ఎవరు కాల్ చేశారో ముందుగానే కాలర్ పేరు, ఫోటోను ప్రదర్శిస్తుంది. అయితే ఇప్పటికే  ఇలాంటి ఫీచర్ కోసం Jio  సర్వీసు Truecaller యాప్‌తో చర్చలు జరుపుతోంది. అయితే కంపెనీ వ్యక్తిగత గోపికను దృష్టిలో ఉంచుకుని కాలర్ ఐడి ఫీచర్‌ను అమలు చేయడం మానుకుంది.  కాలర్ ఐడి ఫీచర్ వల్ల ప్రజలకు ప్రైవసీ సమస్యలు తలెత్తుతాయని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios